హానర్ మ్యాజిక్‌ప్యాడ్ 3 ప్రో: విశేషాలు, ఫీచర్లు, ధర, లభ్యత
హానర్ చైనాలో కొత్త టాబ్లెట్‌ను లాంచ్ చేసింది. దీనిని మ్యాజిక్‌ప్యాడ్ 3 ప్రో పేరిట విడుదల చేసింది. ఈ టాబ్లెట్‌తో హానర్ తన ప్రీమియం టాబ్లెట్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసింది. ఈ టాబ్లెట్‌లో అద్భుతమైన OLED డిస్‌ప్లే, ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, అత్యంత సన్నని డిజైన్ ఉన్నాయి. ముఖ్యంగా, దీని మందం కేవలం 4.8mm మాత్రమే! ఇది మార్కెట్‌లోని అత్యంత సన్నని టాబ్లెట్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ కొత్త టాబ్లెట్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
హానర్ మ్యాజిక్‌ప్యాడ్ 3 ప్రో ధర
చైనాలో హానర్ మ్యాజిక్‌ప్యాడ్ 3 ప్రో ప్రారంభ ధర దాదాపు 4,499 యువాన్లు. అంతే ఇది భారతీయ రూపాయలలో సుమారుగా రూ. 66,100కు సమానం అని అర్థం. ఇక:
- 12GB + 256GB మోడల్ ధర 4,999 యువాన్లు
- 12GB + 512GB వేరియంట్ ధర 5,499 యువాన్లు
- టాప్-ఆఫ్-ది-లైన్ 16GB + 512GB మోడల్ ధర 5,999 యువాన్లు
హానర్ మ్యాజిక్‌ప్యాడ్ 3 ప్రో లభ్యత
కంపెనీ దీనిని మూన్‌లైట్ వైట్, స్టార్రీ స్కై గ్రే రంగులలో పరిచయం చేసింది. ప్రస్తుతం ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. చైనాలో ఈ పరికరం మొదటి సేల్ ఏప్రిల్ 30న మొదలవుతుంది. ఇది హానర్ మాల్, అధీకృత ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంటుంది. కాగా, భారత టెక్ మార్కెట్లో దీని విడుదల గురించి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
హానర్ మ్యాజిక్‌ప్యాడ్ 3 ప్రో ఫీచర్లు
12.3-అంగుళాల 3K OLED డిస్‌ప్లే
- 3000 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్
- 165Hz రిఫ్రెష్ రేట్
- 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
- 93 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో
పనితీరు:
- స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్
- ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 10
కెమెరాలు:
- 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా
- 9-మెగాపిక్సెల్ ముందు కెమెరా
బ్యాటరీ:
- 10,100mAh సామర్థ్యం
- 66W ఫాస్ట్ ఛార్జింగ్
- 27W