ఈ వారంలో విడుదలయ్యే 5G స్మార్ట్ ఫోన్స్!

ఈ వారం భారత మార్కెట్లో విడుదలయ్యే 5G స్మార్ట్ ఫోన్స్!

కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్! ఈ నెలలో మూడు బ్రాండెడ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. అవి మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్, షియోమీ 17T, లావా బోల్డ్ N2 5G. అద్భుతమైన ఫీచర్లతో వస్తోన్న ఈ మూడు పరికరాలు ఈ నెలలో ఏ తేదీన? ఏ ఫీచర్లతో వస్తున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

లావా బోల్డ్ N2 5G

ఈ లావా బ్రాండెడ్ ఫోన్ జూన్ 3వ తేదీన అంటే ఈ రోజే లాంచ్ అవుతుంది. దీని సేల్స్ కంపెనీ వెబ్‌సైట్, అమెజాన్‌లో ప్రారంభమవుతాయి. లావా బోల్డ్ N2 5G స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఈ హ్యాండ్‌సెట్ క్లీన్ ఆండ్రాయిడ్ 16 అనుభవాన్ని అందిస్తుంది, అంటే ఇందులో ముందుగా ఇన్‌స్టాల్ చేయబడిన బ్లోట్‌వేర్ యాప్‌లు ఉండవు.

ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్‌సెట్, 8GB RAM, 128GB స్టోరేజ్, 6.5-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 4G VoLTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.2, USB-C పోర్ట్, 5000mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

షావోమి 17T

ఈ కొత్త షావోమి ఫోన్ ఈ వారం జూన్ 4న విడుదల కానుంది. తర్వాత ఈ పరికరం కంపెనీ వెబ్ సైట్, అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది. ఇక ఫీచర్ల గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 67W హైపర్‌ఛార్జ్ సపోర్ట్‌తో 6500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుందని మైక్రోసైట్ వెల్లడించింది. వేగం, మల్టీటాస్కింగ్ కోసం, ఈ హ్యాండ్‌సెట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్‌ను ఉపయోగించారు.

ఈ ఫోన్‌లో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 5G సపోర్ట్, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, USB-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్

ఈ కొత్త మోటర