మొక్కలు నాటడం మన జీవితంలో భాగస్వామ్యం కావాలి: పొన్నం
మొక్కలు నాటడం మన జీవితంలో భాగస్వామ్యం కావాలి: పొన్నం
సిద్దిపేట: మొక్కలు నాటడం అనే కార్యక్రమం మన జీవితంలో భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట అటవీ శాఖ ఆధ్వర్యంలో అర్బన్ ఆక్సిజన్ పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమం లాంచనంగా పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి చెట్టు విలువ తెలుసా అనే పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు.
ప్రపంచమే కుగ్రామంగా మారుతున్న వేళ పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు నాటాలని, హుస్నాబాద్ నియోజకవర్గంలో 280 మహిళా సంఘాలకు 13 రకాల వస్తువులు గవర్నర్ చేత మీద స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశామని, 500 హోటల్స్ కి గ్లాస్ లు పంపిణీ చేశామని, ఈ రోజు హుస్నాబాద్ మున్సిపాలిటీ, సూర్యాపేటతో కలిసి అవార్డు తీసుకుంటుందని, ఢిల్లీలో కాలుష్యంతో నివసించే పరిస్థితి లేదని, తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవి పాలసీ తీసుకొచ్చారన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా సున్నా టాక్స్ అమలు చేస్తున్నామని, మొక్కలు నాటడానికి అన్ని గ్రామాల్లో ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని, ప్రజలందరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు ఎక్కడ చూసినా పండ్ల మొక్కలు ఉండేవని, ఇప్పుడు లేకపోవడం వల్ల కోతులు గ్రామాల్లోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్నాయని, తెలంగాణలో నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నామని, ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలని, ఎక్కడ ప్రభుత్వం స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటాలని పొన్నం పిలుపునిచ్చారు.
ప్రభుత్వం గీతా కార్మికుల కోసం కాటమయ్య రక్షణ కవచాలు ఇచ్చేటప్పుడు తాటి చెట్లు ఈత చెట్లు నాటిస్తోందని, గత సంవత్సరం అటెండర్ నుండి మొదలు జిల్లా కలెక్టర్ వరకు ఒకే రోజు మొక్కలు నాటారని, అలాంటి కార్యక్రమం తీసుకోవాలని, పర్యావరణాన్ని కాపాడడానికి ప్రకృతి రక్షించడానికి మనం పని చేయాలని, పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేయడం కాదు పాటించాలని, గ్రామాల్లో మొక్కలు నాటడంలో ఒక కాంపిటీషన్ క్రియేట్ చేయాలని, మంచిగా మొక్కలు నాటిన గ్రామాల్లో సర్పంచ్ లను అభినందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపి రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ హైమావతి, సిపి రష్మీ పెరుమాళ్,అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మి కిరణ్ , డిఎఫ్ఓ, జిల్లా గ్ర