నల్లమలసాగర్ కోసం ఎపి ఎర

నల్లమలసాగర్ కోసం పాలమూరును ఎరగా వేస్తున్నారు!

పోలవరం- నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు నికర జలాలు సమీకరించే పనిలో భాగంగా గోదావరిలో తెలంగాణకు ఉన్న 968 టిఎంసిల నీటిలో కోత పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు వరద జలాల ఆధారిత ప్రాజెక్టుకు అనుమతులు జారీ చేస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి అటువంటి ప్రతిపాదనలను అంగీకరించవలసి వస్తుంది.

ఈ ప్రతిపాదన కేంద్ర జల సంఘం వారి ప్రతిపాదనల్లో ఉందని పత్రికలు పేర్కొన్నాయి. అంటే గోదావరిలో తెలంగాణకున్న 968 టిఎంసిల నీటిలో కోత పడుతుందన్నమాట. ఇదంతా పోలవరం- నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు నికర జలాలు సమీకరించే పనిలో భాగంగా జరుగుతున్న ప్రక్రియ.

పోలవరం- నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు తెలంగాణ అంగీకరిస్తే పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎపి నుంచి ఎన్‌ఒసి సాధిస్తానని ముఖ్యమంత్రి అంటున్నారు. ఇది మనకు రెండు రకాలుగా నష్టదాయకం.

నిజానికి పాలమూరుకు గత ప్రభుత్వం కేటాయించిన 90 టిఎంసిల నీళ్ళు మనవే. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ద్వారా చట్టబద్ధంగా నాగార్జునసాగర్ ఎగువన వాడుకోవలసిన కృష్ణా నీళ్ళు.

ట్రిబ్యునల్‌లో రెండు రాష్ట్రాల వాదనలు ముగిసినాయి. ఆ వాదనలపై ఇరు రాష్ట్రాలు తమ వివరణలు సమర్పించాల్సి ఉన్నది. ఆ తర్వాత ట్రిబ్యునల్ ఎప్పుడైనా అంతిమ తీర్పు వెలువరించే అవకాశం ఉన్నది.

నాగార్జునసాగర్ ఎగువన ఉన్నది తెలంగాణనే కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 45 టిఎంసిల నీళ్ళు తెలంగాణవే అవుతాయి. ఈ అంశం ఇప్పుడు అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956, సెక్షన్ 3 కింద కృష్ణా ట్రిబ్యునల్‌లో విచారణలో ఉంది.

పాలమూరుకు ఎన్‌ఒసి ఇచ్చినందున సమ్మక్క సాగర్‌కు కేటాయించిన 47 టిఎంసి నీటిని ఎపికి వదులుకోవలసి వస్తుంది. ఈ ప్రతిపాదన కేంద్ర జల సంఘం వారి ప్రతిపాదనల్లో ఉందని పత్రికలు పేర్కొన్నాయి.

అంటే గోదావరిలో తెలంగాణకున్న 968 టిఎంసిల నీటిలో కోత పడుతుందన్నమాట. ఇదంతా పోలవరం -నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు నికర జలాలు సమీకరించే పనిలో భాగంగా జరుగుతున్న ప్రక్రియ.

ఎందుకంటే వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేసే విధానం దేశంలో లేదు. ఆంధ్రప్రదేశ్‌కు వరద జలాల ఆధారిత ప్రాజెక్టుకు అనుమతులు జారీ చేస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి అటువంటి ప్రతిపాదనలను అంగీకర