కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం భూముల చుట్టే తిరుగుతుంది: వివేకానంద

కాంగ్రెస్ ప్రభుత్వం భూముల చుట్టే తిరుగుతుంది: వివేకానంద

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అన్ని వర్గాలను మోసం చేస్తుందని బిఆర్ఎస్ మాజీ మంత్రి వివేకానంద ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సిఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని వివేకానంద అన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో రేవంత్ ముందుకెళ్తున్నారని, 30 నెలల్లో రూ.12 వేల కోట్ల విలువైన భూములు అమ్మారని విమర్శించారు.

హైకోర్టు ఉత్తర్వులు ఉండగా భూములు అమ్మారని, రేవంత్ తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మొత్తం భూముల చుట్టే తిరుగుతుందని, హిల్ట్ పాలసీలతో భూములు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు.

మూసీ ప్రక్షాళన పేరుతో భూదందా అని ఫోర్త్ సిటీ పేరుతో దందాలు చేస్తున్నారని, రేవంత్ పాలనలో రైతులు నరకయాతన పడుతున్నారని వివేకానంద ఆవేదనవ్యక్తం చేశారు.

నిరుద్యోగులను మోసం చేశారని, కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారని, సన్యాసం తీసుకున్న సన్నాసి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, రైతుల విషయంలో ప్రశ్నస్తే సమాధానం లేదని అన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తమపై బురదజల్లుతున్నారని, అన్ని వర్గాలను రేవంత్ మోసం చేశారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని వివేకానంద హెచ్చరించారు.

రేవంత్‌కు పరిపాలన చేతకావడం లేదు

సిఎం రేవంత్ రెడ్డి పాలనపై వివేకానంద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌కు పరిపాలన చేతకావడం లేదని, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని అన్నారు.

రేవంత్ ప్రభుత్వం మొత్తం భూముల చుట్టే తిరుగుతుందని, హిల్ట్ పాలసీలతో భూములు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. మూసీ ప్రక్షాళన పేరుతో భూదందా అని ఫోర్త్ సిటీ పేరుతో దందాలు చేస్తున్నారని విమర్శించారు.

రైతులు నరకయాతన

రేవంత్ పాలనలో రైతులు నరకయాతన పడుతున్నారని వివేకానంద ఆవేదనవ్యక్తం చేశారు. నిరుద్యోగులను మోసం చేశారని, కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారని, సన్యాసం తీసుకున్న సన్నాసి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.