దేశానికి ఆధ్యాత్మిక హబ్ గా ఎపి మారనుంది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను ఆధ్యాత్మిక హబ్‌గా మార్చడానికి సిద్ధం: సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను ఆధ్యాత్మిక హబ్‌గా మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ శిక్షణలో యువత యోగాసనాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు.

ఉండవల్లి గుహల దగ్గర యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బాబారామ్ దేవ్ మంచి గుర్తింపు తీసుకొచ్చారని తెలియజేశారు.

ప్రస్తుత సమాజంలో యువత చాలా ఒత్తిడితో ఉందని, ఆధ్యాత్మికతతో కూడిన సాంకేతికత చాలా అవసరం అని సూచించారు. ప్రపంచవ్యాపంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని, దేశానికి ఆధ్యాత్మిక హబ్ గా ఎపి మారనుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

సిఎం చంద్రబాబు నాయుడు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడు అని బాబారామ్ దేవ్ కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా సిఎం కృషి చేస్తున్నారని అన్నారు.

బాబారామ్ దేవ్ తో కలిసి చంద్రబాబు యోగా సాధన చేశారు. బాబారామ్ దేవ్ శిక్షణలో జరగుతున్న యోగా సాధననను తిలకించారు. వివిధ రకాల యోగా ప్రకియలను సిఎంకు వివరించారు.

యోగా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం అని అమరావతి దేవతల రాజధాని...ఇప్పుడు యోగా రాజధాని అని బాబారామ్ దేవ్ ప్రశంసించారు.

యోగా రాజధానిగా ఎపి అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్‌ను యోగా రాజధానిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యోగా మన సంస్కృతిలో అంతర్భాగమని, దానిని ప్రజలు రోజువారీ జీవితంలో అనుసరించాలని ఆయన సూచించారు.

బాబా రామ్ దేవ్‌తో కలిసి యోగా సాధన చేసిన చంద్రబాబు, ఆయన శిక్షణలో జరగుతున్న యోగా కార్యక్రమాలను తిలకించారు.

ఆధ్యాత్మిక హబ్‌గా ఎపి

ప్రపంచంలో 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్‌ను ఆధ్యాత్మిక హబ్‌గా మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

యువత ఒత్తిడి నుండి బయటపడేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, అందువల్ల యువత యోగాను తమ రోజువారీ జీవితంలో అనుసరించాలని ఆయన సూచించారు.

విజన్ ఉన్న నాయకుడు: బాబా రామ్ దేవ్

సిఎం చంద్రబాబు నాయుడు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడు అని బాబారామ్ దేవ్ కొనియాడారు. ప్రధాని నరే