ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అటు హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరిజగన్నాథ్ సాలిడ్ హిట్ అందుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ ఊర మాస్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే తెలంగాణ యాసలో మాట్లాడి అదరగొట్టాడు. ముఖ్యంగా పూరిజగన్నాథ్ డైలాగ్స్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను దింపారు పూరిజగన్నాథ్. ఆగస్టు 15న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన డబుల్ ఇస్మార్ట్ సినిమా పూరి ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. అయితే ఈ సినిమాలో ల్యాగ్ ఎక్కువ ఉంది అంటూ చూసిన ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమాలో పూరిజగన్నాథ్ అలీతో ఓ కామెడీ ట్రాక్ ను పెట్టారు. పూరిజగన్నాథ్ ప్రతి సినిమాలో కామెడీకి సపరేట్ ట్రాక్ ఉంటుంది. అలాగే అలీతో ఆయన దాదాపు అన్ని సినిమాలో కామెడీ పండించారు. కానీ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో మాత్రం అలీ ట్రాక్ బెడిసి కొట్టిందని అంటున్నారు ఆడియన్స్. అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమాలో అలీ క్యారెక్టర్ పేరు బొక. అయితే ఈ పదం సినిమాలో వినిపించేటప్పుడు చాలా దారుణంగా వినిపించింది అంటున్నారు ఫ్యాన్స్. పరమ భూతుగా వినిపించింది ఆ పదం.
ఈ క్యారెక్టర్ ను క్రియేట్ చేసింది దర్శకుడు పూరిజగన్నాథ్ కాదట. ఈ క్యారెక్టర్ ను చెప్పింది అలీనేనట.. అలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిల్లా సినిమా షూటింగ్ మలేషియాలో చేశాం.. ఆ టైంలో మేనేజర్‌గా మనిషిని కాకుండా ఓ చింపాంజీని పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. చింపాంజీ మేనేజర్ అయితే ఎలా ఉంటుందో చేసి చూపించా దాంతో ప్రభాస్ గంటన్నర పాటు పడిపడి నవ్వారు అని చెప్పుకొచ్చారు అలీ. ఆ విషయం పూరీకి చెప్పా. ఆయన ఈ ట్రాక్ భలే ఉంది. మన సినిమాల్లో ఎక్కడైనా పెడదాం అని అన్నారు. ఆతర్వాత ఆ క్యారెక్టర్ గెటప్ చూడగానే నేను షాక్ అయిపోయాను. స్వయంగా పూరీనే అక్కడ లాంగ్వేజ్‌ని రాసి ఈ క్యారెక్టర్‌ని రాశారు అని అలీ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి అలీ సీన్స్‌ను డిలీట్ చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉందని తెలుస్తోంది. చాలా మంది అలీ సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అలీ నటించిన సీన్స్‌ను కత్తిరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.