మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంలో మరో కీలక పరిణామం
గతేడాది జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో వెలుగులోకి వచ్చిన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంలో మరో కీలక పరిణామం నెలకొంది. ఈ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌ను దుబాయ్‌లో ఇటీవల అరెస్టు చేశారు. త్వరలో అతన్ని భారతదేశానికి తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు ఈరోజు (శుక్రవారం) ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు.
చంద్రకర్‌తో పాటు యాప్ మరొక ప్రమోటర్ అయిన రవి ఉప్పల్‌ను కూడా గత ఏడాది చివర్లో దుబాయ్ లోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ లింక్‌ని తెరవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మహాదేవ్ ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లో తమ విచారణలో సౌరభ్ చంద్రకర్, రవితో చత్తీస్‌గఢ్‌కు చెందిన వివిధ ఉన్నతస్థాయి రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేశారు.
మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లలో ఒకరైన చంద్రకర్ వివాహం కోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ వివాహానికి హాజరైన వారి కోసం ఓ ప్రైవేటు జెట్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు ఇంగ్లీస్ మీడియా స్టోరీ ప్రసారం చేసింది. ఈ కార్యక్రమం కోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి రూ.112 కోట్లు డబ్బును కంపెనీ నిర్వాహకులు చెల్లించినట్లు తెలిపారు. ఒక్క హోటల్ గదుల కాస్తే రూ.42 కోట్లను నిర్వాహకులు చెల్లించా