కొత్త లేబర్ చట్టాలు: ఉద్యోగులకు బంపర్ న్యూస్, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్‌పై కీలక మార్పులు
దేశవ్యాప్తంగా కొత్త లేబర్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాలపై ప్రజల్లో చాలా ఆందోళనలు ఉన్నాయి. అసలు ఈ చట్టాలేంటో, దాని వల్ల తమ జీతాలు ఎంత కట్ అవుతాయో, కంపెనీలకు లాభం జరిగి.. ఉద్యోగులకు నష్టం జరుగుతుందేమో అనే భయాలు చాలామందిలో ఉన్నాయి. అయితే, చాలా మందిలో ఉండే మరో డౌట్ ఏంటంటే ఒకవేళ కంపెనీ గనుక ఉద్యోగిని తీసేసినా.. లేకపోతే ఉద్యోగే రాజీనామా చేసినా తమ పరిస్థితి ఏంటనే సందేహం ఉంటుంది. దానికి సంబంధించి లేబర్ చట్టాల్లో కీలక విషయం ఉంది.
ఇప్పటి వరకు అమలవుతున్న విధానం ఏంటంటే.. ఒక ఉద్యోగి రాజీనామా చేసినా లేకపోతే కంపెనీనే వాళ్లను తీసేసినా.. వాళ్లకు రావాల్సిన జీతాలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్ క్యాష్‌మెంట్ ఇలాంటివన్నీ సెటిల్ చేయడానికి కనీసం 30రోజుల గడువు తీసుకుంటుంది కంపెనీ. అయితే ఇక నుంచి అలా కాదు. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ రెండు రోజుల్లో చేయాలి. అంటే ఉద్యోగి లాస్ట్ వర్కింగ్ డే అయిన తర్వాత రెండు రోజుల్లో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ చేయాలి. అయితే, గ్రాట్యుటీ మాత్రం తర్వాత చెల్లించవచ్చు.
అందరికీ ఇదే రూల్ వర్తిస్తుందా? లేకపోతే కొందరికేనా..?
కొత్త చట్టాల ప్రకారం.. అన్నిరకాల ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. కింది స్థాయి ఉద్యోగులు కావొచ్చు. పైస్థాయిలో ఉండే సీనియర్ లెవల్ ఉద్యోగులు కావొచ్చు. ఎవరికైనా ఈ రూల్ వర్తిస్తుంది. అలాగే, ఉద్యోగి రాజీనామా, లేఆఫ్‌తో పాటు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా కూడా రెండు రోజుల్లో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ చేయాల్సిందే.
ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్‌లో ఏమేం ఉంటాయి?
ఒక ఉద్యోగి కంపెనీ నుంచి విడిపోతున్నప్పుడు.. వారికి చెల్లించాల్సిన అన్ని రకాల డ్యూస్‌లను కలిపి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ అంటారు. అందులో ప్రొవిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్స్‌తో పాటు స్టాక్ ఆప్షన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు కోసం మళ్లిస్తూ ఉంటారు. అదే ప్రొవిడెంట్ ఫండ్. కంపెనీ కూడా వాళ్ల తరపున కొంత మొత్తాన్ని ఫండ్‌కు జమ చేస్తూ ఉంటుంది. ఇలా కొన్నేళ్ల పాటు జమ అయిన మొత్తాన్ని ఉద్యోగి రిటై