వారేవా వంశీ.. 4 నెలలు 4 సినిమాలు.. ప్లానింగ్ సూపర్..
టాలీవుడ్ నిర్మాణ సంస్థలలో ఒకటి సితార ఎంటర్టైన్మెంట్స్. ఇటీవల దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసి గ్రాండ్ గా రిలీజ్ చేసి భారీ లాభాలు చేసారు సితార అధినేత నాగవంశీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు డిస్టిబ్యూషన్ కూడా చేస్తూ టాప్ నిర్మాణ సంస్థ గా మారింది సితార ఎంటర్టైన్మెంట్స్. ఇదిలా ఉండగా ఈ సంస్థ రాబోయే మూడు నెలల్లో నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ సరికొత్త రికార్డు క్రియేట్ చేయనుంది.
ముందుగా ఈ అక్టోబరు 31న దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరితో చేస్తున్న'లక్కీ భాస్కర్' ను రిలీజ్ చేస్తోంది. ఈ సినిమా కంటెంట్ పై నమ్మకంతో ఒకరోజు ముందు 30వ తేదీన ప్రీమియర్స్ వేయనున్నారు. అలాగే నవంబరులో మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా రానున్న మ్యాడ్ 2 ను రిలిజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇంకా ఫైనల్ కాలేదు. ఇక డిసెంబరు లో గౌతమ్ తిన్ననూరి దర్శకతంలో వస్తున్నా మ్యాజిక్ సినిమాను విడుదల చేస్తున్నారు. అలానే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్ లో వస్తున్న డాకు మహారాజ్ (వర్కింగ్ టైటిల్ ) ను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. నవంబరులో మ్యాజిక్ వస్తే వరుసగా నాలుగు నెలలు నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన నిర్మాణ సంస్థ గా సితార సంస్థ పేరు నిలుస్తుంది. గతంలో సంక్రాంతికి ఒకే సారి రెండు సినిమాలు రిలీజ్ చేసిన ఘనత మైత్రీ మూవీ మేకర్స్ రిక