వైద్యుడికీ తప్పని రోగాల తిప్పలు

వైద్యుడికీ తప్పని రోగాల తిప్పలు: ఒక హెచ్చరిక

భారతదేశంలో వైద్యుల సగటు ఆయుర్దాయం 58.1 సంవత్సరాలు, ఇది సాధారణ జనాభా సగటు అయిన 73.6 సంవత్సరాల కంటే గణనీయంగా తక్కువగా ఉంటుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం ప్రకారం, వైద్యులు అధిక స్థాయిలో బర్న్‌అవుట్, డిప్రెషన్, ఆందోళనను ఎదుర్కొంటున్నారు. సర్వేలో పాల్గొన్న వైద్యులలో 49.6% మంది తీవ్రమైన బర్న్‌అవుట్‌ను ఎదుర్కొంటున్నట్లు నివేదించారు.

శారీరకంగా 51.8% కంటే ఎక్కువ మంది వైద్యులు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారని, అధిక ఒత్తిడి, సరైన జీవనశైలి లేకపోవడం వల్ల చాలా మంది అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొంటున్నారని నివేదిక సూచిస్తుంది. వైద్యుల శ్రేయస్సును మెరుగుపరచడానికి, ఐఎంఎ మెరుగైన పని పరిస్థితులు, ఆరోగ్య బీమా, కార్యాలయ ఒత్తిడి తగ్గింపు కార్యక్రమాలతో సహా పలు చర్యలను ప్రతిపాదించింది.

ఈ వార్తలో పేర్కొన్న విషయం ఏమిటంటే, భారతదేశంలో సగటు పౌరుడి ఆయుర్దాయం సుమారు 73.6 సంవత్సరాలు ఉండగా, వైద్యుల అంచనా ఆయుర్దాయం కేవలం 58.1 సంవత్సరాలు మాత్రమే” అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిర్వహించిన అధ్యయనం పేర్కొంది.

ఈ అధ్యయనంలో ప్రధానంగా వెల్లడైన అంశాలు:

  • సర్వేలో దేశవ్యాప్తంగా 1,537 మంది వైద్యులు పాల్గొన్నారు.
  • 22.2% మంది డిప్రెషన్ లక్షణాలు చూపించారు.
  • 23.3% మంది ఆందోళనతో బాధపడుతున్నారు.
  • 2.8% మందిలో ఆత్మహత్య ఆలోచనలు ఉన్నట్లు గుర్తించారు.
  • 49.6% మంది నిరంతర అలసట, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు.
  • 51.8% మందికి నిద్ర సమస్యలు ఉన్నాయి.
  • 32.1% మందికి అధిక రక్తపోటు ఉంది.
  • 24.2% మంది అధిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు.
  • 21.7% మందికి మధుమేహం ఉంది.
  • 19.4% మందికి అధిక కొలెస్ట్రాల్ ఉంది.
  • 16.8% మంది ఊబకాయంతో ఉన్నారు.

కారణాలుగా పేర్కొన్నవి:

  • రోజుకు ఎక్కువ గంటలు పని చేయడం
  • నిరంతర మానసిక ఒత్తిడి
  • సరిపడా నిద్ర లేకపోవడం
  • సమయానికి ఆహారం తీసుకోకపోవడం
  • వ్యాయామం చేయకపోవడం
  • రోగుల బంధువుల నుంచి హింస లేదా బెదిరింపులు
  • న్యాయపరమైన ఒత్తిళ్లు
  • పని-వ్యక్తిగత జీవితంలో సమతుల్యత లే