150 రోజుల్లో 150 కేసులు వేశారు: లోకేష్
మంత్రి నారా లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్: 150 రోజుల్లో 150 కేసులు వేశారు
అమరావతి: క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎపి మంత్రి నారా లోకేష్ కొనియాడారు. స్పోర్ట్స్ కోటా విషయంలో చాలా పారదర్శకంగా వ్యవహరించామని, పివి సింధు త్వరలోనే కనఫర్డ్ ఐఎఎస్ కానుందని అన్నారు.
ఎపి అసెంబ్లీ సమావేశాల్లో డిఎస్సి-2025 పై లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డిఎస్సిని ఆపేందుకు వైసిపి చాలా ప్రయత్నించిందని, ఐదేళ్లపాటు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదని, 150 రోజుల్లో 150 కేసులు వేశారని విమర్శించారు.
ఉగాదిలోగా వారందరినీ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని, రాష్ట్రాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచన ఇదేనని, కూటమి ప్రభుత్వం సైతం ఇదే బాటలో ముందుకెళ్తోందని లోకేష్ పేర్కొన్నారు.
మరో డిఎస్సిలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. 2019-24 మధ్య ఉపాధ్యాయుల నియామకాల్లేవని, ఒక్క టీచర్ రిక్రూట్ మెంట్ జరగలేదని మండిపడ్డారు. 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని, జివో 117 తో ప్రభుత్వ పాఠశాలలు తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ సిఎం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని ప్రశ్నిస్తున్నారని, కాక్రోచ్ జనతాపార్టీ నిరసనలను వైసిపి ఆదర్శంగా తీసుకుంటోందని అన్నారు. వైసిపి నేతలు సభకు వచ్చి కూర్చుని చర్చించాలని లోకేష్ సూచించారు.
అంబేడ్కర్ గారి విధానాలను తాను అనుసరిస్తున్న