Karnataka: 65 ఏళ్ల వృద్ధురాలికి 33 ఏళ్ల మహిళా లెక్చరర్ కాలేయం దానం.. చివరికిలా..!
అవయవ దానం చేయడం మంచిదే. అది ఎప్పుడు చేయాలి.. కోమాలో ఉన్నప్పుడో.. లేదంటే చనిపోయాక చేయడం మంచిదే. అంతేకాని చిన్న వయసులో.. పసి బిడ్డలు కలిగిన వారు చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇదంతా ఎందుకంటారా? ఒక వృద్ధురాలికి అవయవ దానం చేసి యువతి తనువు చాలించింది. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఈ ఘటన పలువురి హృదయాలను కలిచివేస్తోంది. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.
అర్చన కామత్ అనే 33 ఏళ్ల మహిళా లెక్చరర్.. కర్ణాటకలోని మంగళూరులో తన అత్తగారి సోదరికి 60 శాతం కాలేయం దానం చేసింది. ఆ వృద్ధురాలిని అర్చన కామత్ చాలా ప్రియమైనదిగా భావించింది. ఆమెను ఎంతగానో ప్రేమించి.. ఆమె ఆరోగ్యానికి తోడ్పడాలని భావించింది. అంతే ఆ వృద్ధురాలికి అర్చన కామత్.. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో లివర్ దానం చేసింది. అయితే మూడు రోజుల తర్వాత సర్జరీ విఫలమైంది. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆరోగ్యం క్షీణించి అర్చన కామత్ (33) ప్రాణాలు వదిలింది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అర్చన కామత్‌కు నాలుగేళ్ల బాలుడు ఉన్నాడు.
అయితే ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చంటి బిడ్డ ఉన్న తల్లిని కాలేయం ఇవ్వడానికి కుటుంబ సభ్యులు ఎలా ఒప్పుకున్నారని నిలదీస్తున్నారు. భర్త అంటే మరొక పెళ్లి చేసుకుంటాడు. బిడ్డకు తల్లిని ఎవరు తీసుకొస్తారని మరొకరు ప్రశ్నిస్తున్నారు. మానసిక నిపుణులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి చర్య ఆమోద యోగ్యం కాదని అభిప్రాయపడు