OTT : విజయ్ G.O.A.T ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ..?
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ లేటెస్ట్ రిలీజ్ GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం తమిళ్ లో హిట్ టాక్ తెచ్చుకోగా మిగిలిన అన్ని భాషల్లోను ప్లాప్ టాక్ తెచ్చుకుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. సీనియర్ హీరో ప్రశాంత్, అజ్మల్, ప్రభుదేవా కీలక పాత్రల్లో కనిపించారు. AGS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
తెలుగు రాష్ట్రాల్లో గోట్ భారీ నష్టాలను మిగిల్చింది. అటు కేరళలోను దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు చూసింది. ప్రస్తుతుం థియేటర్లలో రన్ అవుతున్న ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోల చేసారు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్.
విజయ్ గత చిత్రాలు లియో, వారసుడు, మాస్టర్ కు ఓటీటీ లలో రికార్డు వ్యూస్ రాబట్టాయి. ఈ కారణంగా గోట్ ను దాదాపు రూ. 150 కోట్లకు ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్.
మిక్డ్స్ టాక్ రావడంతో నెట్ ఫ్లిక్స్ అలర్ట్ అయింది. వీలైనంత త్వరగా డిజిటల్ ప్రీమియర్ చేసేలా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్టోబరులో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతుంది నెట్ ఫ్లిక్స్. నిర్మాణ సంస్థ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే అక్టోబరు ఫస్ట్ వీక్ లో ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది G.O.A.T