Konda Surekha: మంత్రిపై ఫిర్యాదు చేసిన సొంతపార్టీ ఎమ్మెల్యేలు

కొండా సురేఖ పై వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ముప్పేట దాడి మొదలుపెట్టారు. రాత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షితో భేటీ అయిన ఎమ్మెల్యేలు.. కొద్దిసేపటి క్రితం టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ని కలిశారు.

అన్ని నియోజకవర్గాల్లో కొండా సురేఖ వర్గం పార్టీకి, ఎమ్మెల్యేలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు.

దాంతో కొండా సురేఖ పై చర్యలు తీసుకోవాలని వారు హై కమాండ్ ను కోరారు. మంత్రి కొండా సురేఖ వైఖరితో పార్టీకి నష్టం జరుగుతుందని ఫిర్యాదులో ఏడుగురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వరుసగా మంత్రి కొండా సురేఖ చుట్టూ సమస్యలు అలుముకుంటున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తోంది.

ఈ విషయాన్ని గ్రహిస్తే.. ఎమ్మెల్యేలంతా పార్టీ నాయకత్వంపై ఎలాంటి ఒత్తిడి పెంచే పనిలో పడ్డారో అర్థమవుతుంది.

వరంగల్ లో ఎమ్మెల్యేలు, మంత్రి కొండా సురేఖ మధ్య సమన్వయలేమిని పార్టీ నాయకత్వం ఎలా సరిదిద్దుతుంది అనేది వేచి చూడాల్సిందే.

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో ముగిసిన వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల భేటీలో.. వరంగల్ నేతల మధ్య గ్యాప్ పై ఆయన స్పందించారు.

కార్యకర్తల అత్యుత్సాహం వల్లనే నేతల మధ్య కొన్ని సమస్యలు వస్తున్నాయని, సమస్యలు పరిష్కరించుకోవాలని నేతలకు చెప్పినట్లు ఆయన తెలిపారు.

వరంగల్ జిల్లా నేతలు తనను కలిశారని, వాళ్ళ సమస్య

Close Menu