Indigenous Bullet Trains: 2026 నాటికి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బుల్లెట్ ట్రైన్..

అహ్మదాబాద్-ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్‌లకు జపనీస్ సాంకేతికతను ముందుగా భారత్ రైల్వేలు పరిగణలోకి తీసుకున్నప్పటికీ.. చర్చలు అసంపూర్తిగా ఉన్నాయి. దీని ఫలితంగానే భారతదేశం ఇప్పుడు దేశీయంగా అభివృద్ధి చేసే రైళ్లను తీసుకురావాలని చూస్తోంది. ముఖ్యంగా BEML కోట్ చేసిన ధర, బుల్లెట్ రైళ్ల కోసం జపాన్ కోట్ చేసిన ధర రూ.46 కోట్ల కన్నా తక్కువ. ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్తులో భారతదేశం అంతటా బుల్లెట్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టులకు ఊతం ఇస్తుందని అంతా భావిస్తున్నారు.

భారత్ దేశీయంగా అభివృద్ధి చేయబోతున్న బుల్లెట్ ట్రైన్ గంటకు 280 కి.మీ వేగంతో పరుగెడుతుంది. ముందుగా అనుకున్న జపనీస్ షింకన్‌సెన్ E5 సిరీస్ వేగం గంటకు 320 కి.మీ ఉంది. స్వదేశీ ట్రైన్లను BEML యొక్క బెంగళూరు సదుపాయంలో ఉత్పత్తి చేస్తుంది. 2026 నాటికి డెలివరీ చేయబడుతుందని భావిస్తున్నారు. ఇవి పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ కాన్ఫిగరేషన్‌లను ఆధునిక సౌకర్యాలతో కలిగి ఉంటాయి, వీటిలో రిక్లైనింగ్ మరియు రొటేటబుల్ సీట్లు, నిరోధిత చలనశీలత కలిగిన ప్రయాణీకులకు వసతి మరియు ఆన్‌బోర్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు ఉంటాయి.

భారత్ మొట్టమెదటి సారిగా స్వదేశీయంగా నిర్మించబోతున్న బుల్లెట్ ట్రైన్ రూపకల్పన, తయారీ, కమీషన్ కోసం ప్రభుత్వ యాజమాన్యంలోని BEML(భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్)తో రూ. 866.87 కోట్ల విలువైన ఒప్పందం కుదరించింది. ఇండియన్ రైల్వేస్ ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఆర్డర్ ప్

Close Menu