Top News

Raj Pakala Farm House Party: రాజ్ పాకాల ఫామ్ హౌస్ పార్టీలో మరో ట్విస్ట్

రాజ్ పాకాల ఫామ్ హౌస్ పార్టీలో మరో ట్విస్ట్.

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌ హౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీకి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. రాజు పాకాల ఫార్మ్ హౌస్‌లో క్యాసినో నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్యాసినోకు సంబంధించిన మెటీరియల్‌ను అధికారులు సీజ్‌ చేశారు. క్యాసినోకు సంబంధించిన కాయిన్స్‌ని స్వాధీన పరుచుకున్నారు. పార్టీలో పెద్ద ఎత్తున క్యాసినో నడిచినట్టు అధికారులు గుర్తించారు. నాలుగు సూట్ కేసుల్లో క్యాసినో మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఫామ్ హౌజ్ పార్టీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీలో దొరికిన మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. పోలీసులకు డ్రగ్‌ టెస్టు కోసం శాంపిల్స్‌ ఇవ్వలేదని సమాచారం. పురుషులకే పాజిటివ్ రానప్పుడు మేము ఎందుకు ఇవ్వాలని తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. డ్రగ్‌ పాజిటివ్‌ వచ్చిన విజయ్‌ మద్దూరి పోలీసులకు చుక్కలు చూపించినట్లు సమాచారం. యూరిన్ రావడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. తెల్లవారుజామున 3 గంటలకు విజయ్ శాంపిల్స్ ఇవ్వగా.. టెస్ట్‌లో పాజిటివ్ వచ్చింది.

మోకీల పోలీసులు రాజ్ పాకాలపై కేసులు నమోదు చేశారు. రాజ్ పాకాలపై రెండు కేసులు నమోదు చేశారు. అనధికారికంగా విదేశీ మద్యాన్ని సరఫరా చేసినందుకు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఫాంహౌజ్‌లో పార్టీ నిర్వహించినందుకు మరో కేసు నమోదైంది.

ఇలాంటి

Previous Post Next Post