తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే కష్టాలు ఎన్నో ఎదుర్కొంటున్న సమయంలోనే నష్టాల కొద్దీ నష్టాలే చేకూరుతున్నాయి. ఇప్పుడు మరో నష్టం సంభవించింది. సీనియర్ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి 85 సంవత్సరాల వయస్సులో శనివారం రాత్రి కాలం చేశారు.
శనివారం రాత్రి బాపట్ల జిల్లా కారంచేడులో రాధాకృష్ణమూర్తి తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య శాంతమ్మ కూడా మూడు సంవత్సరాల క్రితం మరణించారు. రాధాకృష్ణమూర్తి భార్య దివంగత శాంతమ్మ శనివారం అంత్యక్రియలు అక్కడే జరిగాయి.
రాధాకృష్ణమూర్తి పలు చిత్రాలకు నిర్మాతగా పని చేశారు. 'ఒక దీపం, వియ్యాలవారి కయ్యాలు, శ్రీ వినాయక విజయం, కోడళ్లు వస్తున్నారు. జాగ్రత్త, కోరుకున్న మొగుడు' లాంటి పలు చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు.
అక్కినేని నాగేశ్వరావుతో పాటు రాధాకృష్ణమూర్తి 'ప్రతిబింబాలు' సినిమాను నిర్మించారు. ఆ సినిమా 1982లో విడుదల కావాల్సి ఉండగా అప్పట్లో కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరావు జయంతి సందర్భంగా నలభై ఏళ్ల తర్వాత ఆ సినిమాను నిర్మాత జాగర్లమూడి రాధా కృష్ణమూర్తి రిలీజ్ చేశారు.
రాధాకృష్ణమూర్తికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. శనివారం రాత్రి ఆయనకు వయోభార సమస్యతో అస్వస్థత కలిగింది. వైద్య పరీక్షలు చేసినప్పుడు కార్డియార్రెస్ట్ కావడంతో వెంటనే ఆంత్య క్రియలు జరిగాయి.
ఇటీవలి కాలంలో రాధాకృష్ణమూర్తి ఇంట్లోనే ఉండి కొన్ని నాటకాలు, సాంఘిక కార్యక్రమాలకు నిర్మాతగా ఉ