రేవంత్ రెడ్డి.. ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారు: హరీష్ రావు

రేవంత్ రెడ్డి.. ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారు: హరీష్ రావు

హైదరాబాద్: తమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, బిఆర్ఎస్ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.

సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వచ్చే ఏడాది రాబోయే కరువును ఎదుర్కోవాలంటే మేడిగడ్డ రిపేర్లు వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

నిన్న ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహట్టి వద్ద కాంగ్రెస్ మంత్రుల హడావిడి చూసిన తర్వాత ఒక విషయం అర్థమవుతోందని, పని తక్కువ ప్రచారం ఎక్కువ అని చురకలంటించారు. మంత్రులకు వాగుడు తప్ప చేతలు శూన్యమని ఎద్దేవా చేశారు.

ఎల్ నినో ప్రభావంతో కరువు వస్తుందని తెలిసినప్పుడు హడావిడిగా బాయి తవ్వినట్లు కాకుండా ముందస్తుగా మేడిగడ్డ రిపేర్లు చేయాలని సూచించారు. కానీ దాన్ని వదిలేసి తమ్మిడిహట్టి కడుతున్నట్లు పేపర్లకు ఫోజులిస్తున్నారని, కురచ బుద్ధితో బిఆర్ఎస్ పై బురద జల్లే కార్యక్రమం తప్ప వారు చేస్తున్నది శూన్యమని మండిపడ్డారు.

150 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పందం జరిగిందని మంత్రి వివేక్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఒక మంత్రి హోదాలో ఉండి ప్రజలు ఏమనుకుంటారన్న సోయి లేకుండా ఇంత పిచ్చి అబద్ధంగా మాట్లాడొచ్చ అని హరీష్ రావు అన్నారు.

నిజంగానే ఒప్పందం ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏడున్నరేండ్లు అధికారంలో ఉండి కూడా తట్టెడు మట్టైనా ఎందుకు తవ్వలేదు అని, ఈ రెండున్నరేళ్లుగా డ్రామాలు చేస్తూ పనులు ఎందుకు స్టార్ట్ చేయలేదని, 30 నెలలుగా కాంగ్రెస్ పార్టీని ఎవరు ఆపారని ఆరోజు మహారాష్ట్ర సిఎం పృథ్వీరాజ్ చవాన్ అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారని, మాతో ఒప్పందం లేకుండా ఏకపక్షంగా పనులు చేస్తున్నారని, ఇవన్నీ నిర్వీర్యం అయిపోతాయని, కాంగ్రెస్ ఏ పని చేసినా అది వృథా అవుతుంది అని స్పష్టంగా చెప్పారు .కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అగ్రిమెంట్ అయిపోయిందని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయి ఉంటే తమ్మిడిహట్టి దగ్గర పనులు ప్రారంభించకుండా తోక పనుల