ఉదయం అల్పాహారంలో ఈ మూడు సూపర్‌ఫుడ్స్ ఉండేలా చూసుకోండి!
ఉదయం అల్పాహారంలో ఈ మూడు సూపర్‌ఫుడ్స్ ఉండేలా చూసుకోండి!
మనం తరచుగా ఉదయాన్నే తీసుకునే బ్రేక్ ఫాస్ట్ విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటాం. పైగా హెల్తీ ఫుడ్ కాకుండా, అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటుంటాం. అయితే, మీకు తెలుసా? రోజంతా శక్తివంతంగా ఉండాలంటే అల్పాహారం చాలా కీలకమని! అల్పాహారంలో మూడు కీలక ఆహార పదార్థాలను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఉదయాన్నే వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, మొత్తం ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి ఆ మూడు సూపర్‌ఫుడ్స్ ఏమిటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందామా?
ఉడికించిన గుడ్లు
గుడ్లను ప్రకృతి మల్టీవిటమిన్ అని పిలుస్తారు. దీనిని ఉదయాన్నే తినడం వల్ల ఒక పరిపూర్ణమైన అల్పాహారం అవుతుంది. ఉడికించిన గుడ్డులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాల మరమ్మత్తు, పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది. వీటిలోని అమైనో ఆమ్లాలు పేగు పొరను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయం గుడ్లు తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీంతో పదే పదే తినే అలవాటును కూడా నివారించవచ్చు.
చియా సీడ్స్
చియా గింజలు సైజు లో చిన్నగా ఉన్నప్పటికీ, ఇవి పోషకాల నిధి. నానబెట్టినప్పుడు చియా గింజలు జెల్ లాంటి పదార్థంగా మారతాయి. ఈ కరిగే పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ పీచుపదార్థం ప్రేగులలోని మంచి బ్యాక్టీరియాకు ఆహారాన్ని అందిస్తుంది. చియా గింజలు భోజనం తర్వాత శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేసి, రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగకుండా నివారిస్తాయి. వీటిని తీసుకోవడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే? రాత్రంతా నీటిలో నానబెట్టి, అల్పాహారంలో చేర్చుకోవడం!
గ్రీక్ యోగర్ట్
సాధారణ పెరుగుతో పోలిస్తే గ్రీక్ యోగర్ట్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చిక్కగా ఉంటుంది. ఇందులోని లైవ్, యాక్టివ్ కల్చర్లు పేగుల మైక్రోబయోమ్‌ను సమతుల్యం చేస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాల్షియం, విటమిన్-బి12 సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు, మెదడు ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. అయితే, దీనిని ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.