భువీ వాళ్లిదరిలా బౌలింగ్ చేస్తాడు.. అంత సమర్థుడు: హేజిల్‌వుడ్
సరైన బౌలింగ్ చేస్తే.. భువీ వాళ్లిదరిలా బౌలింగ్ చేస్తాడు.. అంత సమర్థుడు: హేజిల్‌వుడ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మెరుగైన ఆట తీరు కనబరుస్తోంది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో ఉన్న ఆర్‌సిబి.. నేడు పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారైనట్లే.
ఇక ఆర్‌సిబి జట్టు విషయానికొస్తే.. విరాట్‌తో కూడిన బ్యాటింగ్ లైనప్ పరుగులు రాబడుతుంటే.. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి బౌలర్లు ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. అయితే భువనేశ్వర్‌తో కలిసి బౌలింగ్ చేయడం తనకు ఎంతో బాగుందని హేజిల్‌వుడ్ తెలిపాడు.
‘‘భువనేశ్వర్‌తో కలిసి బౌలింగ్ చేస్తుంటే.. ఆసీస్ బౌలర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌తో వేస్తున్నట్లే అనిపిస్తుంది. వారిద్దరిలా భువీ కూడా స్వింగ్ చేస్తాడు. నేను ఎక్కువగా సీమ్‌తో పాటు బౌన్స్ రాబట్టేందుకు ప్రయత్నిస్తా. కానీ, ఆ ముగ్గురు మాత్రం కొత్త బంతితో స్వింగ్ చేయగల సమర్థులు. ఫ్లాట్ పిచ్‌పై 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే మంచి బౌలింగ్ వేసినట్లే లెక్క. మిగితా బౌలర్లు కనీసం 50 లేదా 60 పరుగులు ఇస్తారు. ఢిల్లీతో మ్యాచ్‌లో మేమిద్దరం కొత్తగా ఏమీ చేయలేదు. మా బలం ఏంటో మాకు తెలుసు. దానిని అమలు చేశాం. పిచ్ నుంచి మంచి సహకారం లభించింది. అలా కాకుండా తొలి ఓవర్‌లోనే 20 పరుగులు ఇచ్చి.. యార్కర్లు లేదా పేస్‌లో మార్పు చేసుకుని నాలుగు ఓవర్ల కోటా కాస్త మంచి గణాంకాలతో ముగించడం చాలా కష్టం. అలాంటి వాటినే నేను ఎక్కువగా ఇష్టపడతా. నాకు గర్వంగా అనిపించేది కూడా అప్పుడే’’ అని హేజిల్‌వుడ్ తెలిపాడు.
ఆర్‌సిబి బౌలింగ్‌లో హేజిల్‌వుడ్, భువనేశ్వర్‌ల ప్రభావం
హేజిల్‌వుడ్, భువనేశ్వర్‌లు ఆర్‌సిబి బౌలింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరూ కలిసి బౌలింగ్ చేస్తుంటే.. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు తిరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి 4 వికెట్లు తీసి ఆర్‌సిబి విజయంలో కీలక పాత్ర పోషించారు.