రోహిత్ పై ఆ పుకార్లను నమ్మొద్దు: బ్యాటింగ్ కోచ్
రోహిత్‌పై పుకార్లను నమ్మొద్దు: బ్యాటింగ్ కోచ్ సితాన్షు
హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఓటమి పాలయింది. తొలి వన్డేలో రోహిత్ శర్మ 11 పరుగులు, రెండో వన్డేలో 26 పరుగులు చేసి విఫలమయ్యాడు. దీంతో రోహిత్ శర్మ వన్డేల నుంచి వైదొలుగుతాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రోహిత్ శర్మకు పొమ్మనకుండానే పొగ పొడబెడుతున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లాండ్ సిరీస్ తరువాత రోహిత్‌ను సెలెక్ట్ చేసే అవకాశాలు లేవని, రిటైర్మెంట్‌పై ఆలోచన చేయాలని బిసిసిఐ వర్గాల చెప్పాయని షికార్లు పుకార్లు చేయడంతో బ్యాటింగ్ కోచ్ సితాన్షు స్పందించారు.
రోహిత్ శర్మ ఒత్తిడి ఫీలయ్యే ఆటగాడు కాదని, అతడికి ఒత్తిడి ఉంటుందని తాను అనుకోనని, రోహిత్ బ్యాటింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్నాడని, రోహిత్ చాలా క్రికెట్ ఆడారని, అలాగే ఎంతో క్రికెట్ చూశారని, కొన్నిసార్లు బ్యాటర్లకు తాము ఆశించిన లయ దొరకకపోవచ్చని, అది సహజమేనన్నారు.
కొన్ని సార్లు షాట్ల ఎంపిక పని చేయదని, మూడో వన్డేలో అతడి నుంచి మంచి బ్యాటింగ్ చూస్తామని ధీమా వ్యక్తం చేశాడు. శుభ్‌మన్ గిల్ వేగంగా ఇన్నింగ్స్ ప్రారంభించారని, ఆ తర్వాత విరాట్ కూడా వేగంగానే బ్యాటింగ్ చేశారని, కానీ రోహిత్‌కు బహుశా తనకు అనుకూలమైన ప్రదేశాల్లో బంతులు పడలేదని, అందుకే అతను లయ అందుకోలేకపోయాడని సితాన్షు రోహిత్ కు మద్దతు తెలిపాడు.
అతను ఇబ్బంది పడ్డాడని తాను అనుకోవడం లేదని, రోహిత్ లాంటి ఆటగాడి నుంచి మనం పూర్తిగా భిన్నమైన ఇన్నింగ్స్‌ను చూసి ఉంటామన్నారు. చాలా మంది బ్యాటర్ల విషయంలో ఇలా జరగడం తాను చూశానన్నారు. ఇది కేవలం రోహిత్‌కు మాత్రమే పరిమితం కాదు అని, బ్యాటింగ్ లో రోహిత్ ఇబ్బంది పడుతున్నాడని తాను అనడంలేదన్నారు.
గత ఎనిమిది వన్డే మ్యాచ్‌లలో 30.1 సగటులో 241 పరుగులు చేసి విఫలమయ్యాడు. ఇలానే బ్యాటింగ్ చేస్తే వరల్డ్ కప్ టీమ్‌లో సభ్యుడిగా తీసుకుంటారా? లేదా అనేది అనుమానంగా ఉంది.
వరల్డ్ కప్ టీమ్‌లో రోహిత్ స్థానం ధిగురచ్చి ఉంది
రోహిత్ శర్మ వరల్డ్ కప్ టీమ్‌లో స్థానం ధిగురచ్చి ఉందని మాజీ క్రికెటర్ సన్నీ గావస్కర్ అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ వంటి అనుభవం ఉన్న ఆటగాడు జట్టుకు అవసరమని, అతడిని వర