ఆస్తి వేలం వివాదం.. బండ్ల గణేశ్‌కు సుప్రీంలో షాక్

బండ్ల గణేశ్‌కు ఆస్తి వేలం వివాదంలో సుప్రీంకోర్టు షాక్

హైదరాబాద్: ఆస్తి వేలం వివాదంలో నిర్మాత బండ్ల గణేశ్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. లోన్ వ్యవహారంలో యూనియన్ బ్యాంకు చర్యలను సవాలు చేస్తూ ఆయన సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. బండ్ల గణేశ్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేసి స్వాధీనం చేసుకోవడంపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

బండ్ల గణేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి యూనియన్ బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్లను తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో బ్యాంకు వారు ఆయన ఆస్తులను వేలం వేసి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. దీనిపై బండ్ల గణేశ్ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన