సినిమా చూస్తుండగా సైబర్ మోసం.. నటి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కొట్టేశారు

సైబర్ మోసం: నటి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కొట్టేశారు

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కీర్తి కుల్హారీ సైబర్ మోసానికి గురయ్యారు. ఆమె బ్యాంక్ ఖాతా నుంచి సుమారు రూ. 2.40 లక్షలను సైబర్ మోసగాళ్లు కొట్టేశారు. అనుమానాస్పద లావాదేవీలను గమనించిన ఆమె, వెంటనే ముంబై పోలీసుల సైబర్ విభాగంలో ఫిర్యాదు చేశారు.

ఈ ఘటన జూలై 24 రాత్రి అంధేరీలోని ఒక మల్టీప్లెక్స్‌లో సినిమా చూస్తున్న సమయంలో జరిగింది. ఆ సమయంలో కీర్తికి విదేశీ లావాదేవీకి సంబంధించిన బ్యాంక్ అలర్ట్ వచ్చింది. తన క్రెడిట్ కార్డ్ ఉపయోగించి 'ఏరోమెక్సికో ఎయిర్‌లైన్స్'కు 2,525 అమెరికన్ డాలర్ల చెల్లింపు జరిగిందని ఆ సందేశంలో ఉంది.

అకస్మాత్తుగా వచ్చిన ఆ సందేశంతో షాక్‌కు గురైన కీర్తి కుల్హారీ, వెంటనే బ్యాంకు కస్టమర్ సర్వీస్ విభాగాన్ని సంప్రదించారు. ఆమె కార్డ్ ఉపయోగించి నాలుగు వేర్వేరు లావాదేవీలు జరిగాయని, వాటి మొత్తం విలువ రూ. 2.43 లక్షలకు పైగా ఉందని బ్యాంక్ దర్యాప్తులో తేలింది. తదుపరి నష్టాన్ని నివారించడానికి బ్యాంక్ వెంటనే ఆమె కార్డును బ్లాక్ చేసింది.

ఆ తర్వాత ఆమె ముంబై సైబర్ పోలీసులకు సమాచారం అందించింది. కీర్తి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మోసగాళ్లు నటి బ్యాంక్ ఖాతా వివరాలను ఎలా పొందారు.. డబ్బును ఎలా బదిలీ చేశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. పోలీసులు బ్యాంకింగ్ రికార్డులు, డిజిటల్ లావాదేవీల వివరాలు, ఈ కేసులోని ఇతర సాంకేత