నాటౌట్ అయినా పెవిలియన్కు కోహ్లీ.. రోహిత్ ఎక్స్ప్రెషన్స్ చూశారా..!
శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో డీఆర్‌ఎస్ తీసుకోకుండా విరాట్ కోహ్లీ పెద్ద తప్పు చేశాడు. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 17 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో.. మెహదీ హసన్ మిరాజ్ వేసిన ఫుల్ డెలివరీ తప్పి బంతి ప్యాడ్‌కు తగిలింది. ఆలస్యం చేయకుండా అంపైర్ అప్పీల్‌ను అంగీకరించి ఔట్ ఇచ్చాడు. ఆ సమయంలో.. తోటి బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌తో మాట్లాడి రివ్యూ తీసుకోకూడదని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. దీంతో.. పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత రీప్లేలలో చూపిస్తూ, బంతి బ్యాట్ అంచున పడినట్లు స్పష్టంగా కనపడింది. ఇది చూసి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆశ్చర్యపోయాడు.