లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తున్న గుజరాత్ గ్రేట్స్ టీమ్.. దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని సథరన్ సూపర్ స్టార్స్‌పై ఓడిపోయింది. గబ్బర్ హాఫ్ సెంచరీతో గర్జించినా గుజరాత్ గ్రేట్స్‌కు ఓటమి తప్పలేదు.
గబ్బర్ హాఫ్ సెంచరీ
37 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న ధావన్.. 48 బంతుల్లో 108.33 స్ట్రైక్ రేట్‌తో 52 పరుగులు చేశాడు. టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన గబ్బర్.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
సథరన్ సూపర్ స్టార్స్ బ్యాటింగ్
సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదన
గుజరాత్ గ్రేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. శిఖర్ ధావన్ మినహా మిగతావారెవరూ రాణించలేదు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన మోర్నీ వాన్ విక్ (15) త్వరగా అవుట్ అవ్వడం దెబ్బకొట్టింది.