టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో అదరూపం చూపిస్తున్నాడు. గురువారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, ఓ సిక్స్‌తో 46 పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో అతడు ఓపెనర్‌గానే ఆడుతుండడం గమనార్హం.
ఇప్పుడు దక్షిణాఫ్రికాతో భారత్‌కు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఉంది. ఇందులో సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. వికెట్ కీపర్‌గా జితేశ్ కుమార్ కూడా ఎంపికయ్యాడు. మొన్నటి వరకు టీ20 జట్టులో రెగ్యులర్ ఓపెనర్‌గా ఉన్న సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్ రీ ఎంట్రీతో మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నాడు.
గిల్ దూరంగా ఉంటే...
శుభ్‌మన్ గిల్ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తేనే ఆడతాడని బీసీసీఐ తెలిపింది. ఒకవేళ గిల్ ఫిట్‌నెస్ సాధించకపోతే అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు.
దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు
- సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)
- శుభ్‌మన్ గిల్
- అభిషేక్ శర్మ
- తిలక్ వర్మ
- హర్దిక్ పాండ్య
- శివమ్ దూబె
- అక్షర్ పటేల్
- జితేశ్ శర్మ
- సంజూ శాంసన్
- వరుణ్ చక్రవర్తి
- అర్ష్‌దీప్ సింగ్
- కుల్‌దీప్ యాదవ్
- హర్షిత్ రాణా
- వాషింగ్టన్ సుందర్
టీ20 సిరీస్ షెడ్యూల్
- తొలి టీ20 మ్యాచ్ – డిసెంబర్ 9న (కటక్)
- రెండో టీ20 మ్యాచ్ – డిసెంబర్ 11న (ఛండీగర్)
- మూడో టీ20 మ్యాచ్ – డిసెంబర్ 14న (ధర్మశాల)
- నాలుగో టీ20 మ్యాచ్ – డిసెంబర్ 17న (లక్నో)
- ఐదో టీ20 మ్యాచ్ – డిసెంబర్ 19న (అహ్మదాబాద్)