Sri Lanka President: నేడు శ్రీలంక అధ్యక్షుడిగా అనురా దిసనాయకే ప్రమాణ స్వీకారం
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిసానాయకే గెలుపు సాధించాడు.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్టు( లెఫ్ట్ పార్టీ) నేత అనుర కుమార దిసానాయకే గెలిచారు. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ అనుర కుమార ప్రత్యర్థులు పొందిన ఓట్లను సమీకరించి విజయం సాధించారు.
ఈరోజు ప్రమాణ స్వీకారం
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్టు( లెఫ్ట్ పార్టీ) నేత అనుర కుమార దిసానాయకే గెలిచారు. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత అనుర కుమార దిసనాయకేను విజేతగా ఎన్నికల సంఘం ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం అనూర కుమార దిసానాయకే ఈరోజు (సోమవారం) శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
56 ఏళ్ల అనుర కుమార తన సమీప ప్రత్యర్థి అయినా సమిత్ జన బలవేగయ పార్టీకి చెందిన సాజిత్ ప్రేమదాసపై విజయం సాధించారు. రణిల్ విక్రమసింఘే స్వతంత్ర అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీలో నిలిచారు. కానీ ఆయన కౌంటింగ్ జరిగిన తొలి రౌండ్‌లోనే పోటీని నుంచి తప్పుకున్నారు.
శ్రీలంక తొమ్మిదవ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న అనుర కుమార దిసానాయకే మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరమున పార్టీకి చెందిన నేషనల్ పీపుల్స్ పవర్ నేత . శ్రీలంకలో రెండేళ్ల క్రితం జరిగిన తిరుగుబాటును అణచివేసిన తర్వాత రణిల్ విక్రమసింఘే పార్లమెంటు ద్వారా ఎన్నుకోబడ్డారు. అయితే, ఆర్థిక సంస్కరణలపై తన ప్రభుత్వం చెప్పిన నిధులు.. తాను ఓటు వేయడంపై విక్రమసింఘే జనత మధ్య చెలరేగిన ఇబ్బందులను ప