35 Chinna Katha Kaadu: 384 ఎంట్రీలలో ఒకటి.. ’35 చిన్న కథ కాదు’ చిత్రంకు అరుదైన ఘనత!

35 చిన్న కథ కాదు: గోవా చలనచిత్రోత్సవంలోకి తెలుగు చిత్రం

'35 చిన్న కథ కాదు' చలనచిత్ర దృశ్యం

చిన్న సినిమాగా విడుదలైన '35 చిన్న కథ కాదు' మంచి సక్సెస్ అందుకుంది. మొదటి రోజు నుంచే పాజిటవ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఓటీటీ వేదిక 'ఆహా'లో కూడా రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోయింది. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. గోవాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)లో ఈ చిత్రంను ప్రదర్శించనున్నారు.

గోవాలోని పనాజీలో నవంబర్‌ 20 నుంచి 28 వరకు ఐఎఫ్‌ఎఫ్‌ఐ 55వ ఈవెంట్‌ జరగనుంది. ఇందులో మొత్తం 25 సినిమాలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం 384 చిత్రాలు ఎంట్రీ చేయగా.. తెలుగు నుంచి '35 చిన్న కథ కాదు' ఎంపికైంది. ఈ విషయాన్ని పోస్ట్ ద్వారా చిత్ర యూనిట్ తెలిపింది. ఇది తెలుగు సినిమాకు ఎంతో గర్వకారణమని పేర్కొంది. ఇండియన్‌ పనోరమ అధికారికంగా ఎంపిక చేసినట్లు ప్రకటించింది.

ఈ విషయాన్ని టెలిగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ ట్వీట్ చేసింది.

''35 చిన్న కథ కాదు' గోవాలో నిర్వహించే ప్రతిష్టాత్మక 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా - ఇండియన్ పనోరమా 2024లో ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రం తెలుగును ప్రాతినిధ్యం వహిస్తూ 384 మినహాయింపుల్లో ఎంపికైంది'' అని ట్వీట్ చేసింది.

నివేదా, విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇది. నంద కిశోర్‌ ఇమాని దర్శకత్వం

Close Menu