ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప పార్ట్ -1 కు కొనసాగింపుగా వస్తున్న పుష్ప – 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు మూడేళ్ళుగా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే కారణంగా డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అందుకు అనుగుణంగా షూటింగ్ పనులు చక చక చేస్తోంది.
మరోవైపు పుష్ప – 2 థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలకు ఇటీవల కాలంలో ఏ ఇతర సినిమాలకు లేనటువంటి ధరకు పుష్ప – 2 రైట్స్ డీల్ జరుగుతుంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కు గాను రూ. 90 కోట్ల రేషియో లో అమ్మకాలు చేస్తున్నారు. ఒక్క ఉత్తరాంధ్ర ఏరియాకు రూ. 23 కోట్లు ధర పలికాడు పుష్పరాజ్.
ఇదే ఏరియాలో అల్లు అర్జున్ సూపర్ హిట్ చిత్రం అల వైకుంఠపురములో 21 కోట్లు వసులు చేసింది. సూపర్ హిట్ చిత్రాలైన సలార్, కల్కి, దేవర, ఏవీ అక్కడ రూ. 20 కోట్లు దాటలేదు. పుష్ప 2 వీటన్నింటినీ దాటాల్సి వుంటుంది. ఇక రాయలసీమ ఏరియా కు రూ. 30 కోట్లకు అమ్ముడయ్యాయి.
పుష్ప -2 కు ఉన్న క్రేజ్, హైప్ కు తగ్గట్టుగానే బిజినెస్ జరుగుతుందని అంటున్నారు ట్రేడ్ అనలిస్ట్ లు. పుష్ప -2 రిలీజ్ నాడు మరే ఇతర సినిమాలు పోటీ లేకపోవం, సోలో రిలీజ్ కావడం పుష్ప – 2 అడ్వాంటేజ్. మరికొద్ది రోజుల్లో పుష్ప రూలింగ్ స్టార్ట్ కాబోతొంది. హిట్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం గ్యారెంటీ.