Elon Musk Grokipedia : వికీపీడియాకు పోటీగా గ్రోకిపీడియా వచ్చేసింది


టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ మరో ప్రాజెక్ట్ గ్రోకిపీడియాను అధికారికంగా లాంచ్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.


గ్రోకిపీడియా అంటే ఏంటి?

grokipedia

ఈ ఏఐ ఆధారిత ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా లైవ్ అయింది.అయితే, ఈ ఏఐ గ్రోకిమీడియా వెబ్‌సైట్ మొదటి కొన్ని గంటల్లోనే క్రాష్ అయింది.

ఈ గ్రోకిపీడియాను యాక్సస్ చేయొచ్చు. ప్రారంభం నుంచే అత్యంత వేగంగా పాపులర్ అవుతోంది.

గ్రోకిపీడియా ఎలా పనిచేస్తుంది?

గ్రోకిపీడియాను వికీపీడియాకు ‘మంచి ప్రత్యామ్నాయం’గా అభివర్ణించాడు.

కానీ, ఈ ప్లాట్‌ఫామ్ చాట్‌జీపీటీ, జెమిని లేదా మస్క్ సొంత గ్రోక్ చాట్‌బాట్ కన్నా భిన్నంగా పనిచేస్తుంది.

సాధారణ కాన్వర్‌జేషన్ చాట్ ఇంటర్‌ఫేస్‌కు బదులుగా సెర్చ్ ఇంజిన్ మాదిరిగా పనిచేస్తుంది.

వినియోగదారులు ఒక అంశం పేరును టైప్ చేస్తే సరిపోతుంది.

గ్రోకిపీడియాను ఎలా ఉపయోగించాలి?

వినియోగదారులు (Grokipedia.com)ని నేరుగా విజిట్ చేయడం ద్వారా ఏదైనా అంశంపై సమాచారం కోసం సెర్చ్ చేయొచ్చు.

గ్రోకిపీడియాలో కనిపించే కంటెంట్ చాలావరకూ ఇప్పటికీ వికీపీడియా నుంచి సేకరించినట్టు తెలిసింది.

యూజర్ల అభిప్రాయాలు

ఎలన్ మస్క్ పోస్ట్‌పై వ్యాఖ్యానించిన చాలా మంది వినియోగదారులు ఎన్‌సైక్లోపీడియా తప్పు సమాధానాలు ఇస్తోందని పేర్కొంటూ సమస్యలను ఎత్తి చూపారు.

కొంతమంది వినియోగదారులు గ్రోకిపీడియా ప్రధానంగా ఎలన్ మస్క్‌ను కీర్తిస్తోంది.

సానుకూల సమాచారాన్ని మాత్రమే చూపిస్తోందని పేర్కొన్నారు.

గ్రోకిపీడియా వికీపీడియాతో పోటీ పడగలదా?

వికీమీడియా ఫౌండేషన్ ప్రతినిధి లారెన్ డికిన్సన్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రోకిపీడియాకు వికీపీడియా ఉనికి తప్పనిసరిగా తెలుస్తుంది.

వికీపీడియా లాభాపేక్షలేని యాడ్ ఫ్రీ విధానాలతో గత రెండు దశాబ్దాలుగా విశ్వసనీయంగా నిలిచింది.

భవిష్యత్తులో గ్రోకిపీడియా నిజంగా వికీపీడియాతో పోటీ పడగలదా లేదా అది కేవలం ఏఐ-ఆధారిత వెర్షన్‌గా మారుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Close Menu