పూర్తిగా ఆటోమేటెడ్.. అంటే డ్రైవర్ అవసరం లేని కారును ఎప్పుడైనా మనం ఊహించుకున్నామా? టెస్లా, గూగుల్ ఆండ్రాయిడ్ కార్లకు పోటీగా నిలిచే అటువంటి డ్రైవర్‌లెస్ కారును మన దేశంలోని బెంగుళూరులో తయారు చేశారు.
ఈ డ్రైవర్‌లెస్ కారు పేరు 'విరిన్'. భవిష్యత్తులో మన దేశంలో స్వయంప్రతిపత్త కార్ల తయారీకి 'విరిన్' మార్గదర్శకంగా నిలవనుంది. 'విరిన్' ప్రాజెక్ట్ కోసం ఆరు సంవత్సరాలు కష్టపడ్డారు.
మన రోడ్లపై ఉండే గుంతలు, అడ్డొచ్చే జంతువులు, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని 'విరిన్' డ్రైవర్‌లెస్ కారును రూపొందించారు.
ఈ డ్రైవర్‌లెస్ కారు AI, మెషిన్ లెర్నింగ్, విజువల్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి పనిచేస్తుంది. ఇది డ్రైవర్ అవసరం లేకుండానే ప్రయాణికులతో మాట్లాడి, వారితో కలిసి ముందుకు సాగుతుంది.
‘విరిన్’లోని V2X కమ్యూనికేషన్ 5G టెక్నాలజీ ద్వారా ఇతర వాహనాలు, ట్రాఫిక్ సిగ్నల్స్‌తో సంభాషిస్తుంది. ఇది ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనం.
దీనిలో అనేక రకాల సెన్సార్లు, కెమెరాలు అమర్చారు. అవి రోడ్డుపై ఉండే అడ్డంకులను గుర్తించడంతో పాటు ప్రయాణికుల భద్రతను కూడా కాపాడేందుకు వీలు కల్పిస్తాయి.
ఈ డ్రైవర్‌లెస్ కారుకు ప్రత్యేకమైన బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. అది 240 కిలోమీటర్లకు పైగా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తుంది.
ఈ కారు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు సమర్థంగా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో పనిచేసే ఈ కారు.. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందింది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC)కి చెందిన సరస్వతి యశస్వి, సౌరభ్ పాండే, KAU నాయుడు, విప్రోకు చెందిన సుమిత్ ఝా, అభిలాష్ నాయుడు, బెంగళూరులోని రాచయ్య బహదూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన సుధాకర్, సంతోష్ తదితరులు 'విరిన్' ప్రాజెక్ట్‌పై పని చేశారు.
అయితే, 'విరిన్' ప్రాజెక్ట్‌పై పని చేస్తున్న బృందం మొత్తం 70 మంది సభ్యులతో పనిచేసి ఈ డ్రైవర్‌లెస్ కారును రూపొందించారు.