Oppo Find X8 Pro: సంచలన ఆఫర్! ఒప్పో ఫైండ్ X8 ప్రోపై కళ్లుచెదిరే డిస్కౌంట్
మీరు కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే, ఇదే బెస్ట్ ఆఫర్! ఒప్పో ఫైండ్ X8 ప్రోపై క్రోమా అధికారిక వెబ్‌సైట్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 86,999కే సొంతం చేసుకోవచ్చు.
ఒప్పో ఫైండ్ X8 ప్రో లాంచ్ అయినప్పుడు భారత మార్కెట్లో రూ. 99,999 ధరతో విడుదలైంది. కానీ ఇప్పుడు క్రోమా వెబ్‌సైట్‌లో రూ. 13,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో లభిస్తోంది.
ఒప్పో ఫైండ్ X8 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఒప్పో ఫైండ్ X8 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,910mAh బ్యాటరీ కలిగి ఉంది. ఈ ఒప్పో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 4,500 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్ డాల్బీ విజన్ సపోర్ట్ కలిగి ఉంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఫైండ్ X8 ప్రో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50MP సోనీ LYT808 ప్రైమరీ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ LYT600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 6x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ IMX858 సెన్సార్, 120x డిజిటల్ జూమ్ వరకు, 50MP శాంసంగ్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కలిగి ఉంది.
ఒప్పో ఫైండ్ X8 ప్రో డిస్కౌంట్ వివరాలు
- ధర: రూ. 99,999
- డిస్కౌంట్: రూ. 13,000
- కొత్త ధర: రూ. 86,999
ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలంటే, క్రోమా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.