తెలంగాణ ప్రాజెక్టులను కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. నదీ జలాలు – కాంగ్రెస్ ద్రోహులు అంశంపై తెలంగాణ భవన్లో హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని, తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్‌తో అన్యాయం
ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టుకథలు, రేవంత్ రెడ్డి పిట్ట కథలు చెప్పారని మండిపడ్డారు. ఫజల్ అలీ కమిషన్ వద్దన్నా.. ఆంధ్రాలో కలిపి తెలంగాణకు ద్రోహం చేశారని హరీశ్ రావు అన్నారు.
పాలమూరుకు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. కానీ, కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకున్నారు. విభజన సమయంలోనూ మనకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ.
11వ షెడ్యూల్‌లో పాలమూరు – రంగారెడ్డి పెట్టలేదు. ఇలా అనేక విషయాల్లో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది.
కేసీఆర్ హెచ్చరికలే నిజం
మొదటి నుంచి కేసీఆర్ చెబుతున్న మాటలు నేడు అక్షర సత్యం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 40రోజుల్లోనే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించారు.
కేసీఆర్ ప్రశ్నించిన తరువాత ప్రాజెక్టులను అప్పగించబోమని అసెంబ్లీ తీర్మానం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 11 ప్రాజెక్టులకు డీపీఆర్ లు పంపాం.. ఏడు ప్రాజెక్టులకు అన్ని అనుమతులు సాధించాం.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క డీపీఆర్ కూడా పంపలేదు.. మూడు డీపీఆర్ లు వెనక్కి తెచ్చారని హరీశ్ రావు అన్నారు.
మా సక్సెస్ రేట్ 60శాతం, కాంగ్రెస్ సక్సెస్ రేట్ మైనస్30శాతం అని హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రాయలసీమ లిఫ్ట్‌పై కాంగ్రెస్ కుట్ర
రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపింది కాంగ్రెస్ అని రేవంత్ అబద్ధాలు చెబుతున్నాడు.