మన క్రికెటర్ల ప్రస్థానం: అపోలో టైర్స్ ప్రత్యేక వీడియో

టీం ఇండియా కొత్త స్పాన్సర్‌ హక్కులు ‘అపోలో టైర్స్’ దక్కించుకున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్‌లపై నిషేధం విధించడంతో ‘డ్రీమ్ 11’ను స్పాన్సర్‌గా బిసిసిఐ తప్పించింది. ఆ తర్వాత ‘అపోలో టైర్స్’ టీం ఇండియా నూతన స్పాన్సర్‌గా మారింది. అయితే తాజాగా అపోలో టైర్స్ ఓ ప్రత్యేకమైన వీడియో విడుదల చేసింది. దీనికి ‘హర్ సఫర్‌ మే దమ్ హే’ అనే పేరు పెట్టింది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, శుభ్‌మాన్ గిల్‌లు భారత జెర్సీలతో కనిపించారు. టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ కూడా ఈ వీడియోలో తళుక్కమన్నారు.



ఇందులో మన క్రికెటర్లు బాల్యం నుంచి జాతీయ జట్టులో ప్రస్తుత స్థానాలకు ఎదిగే వరకూ వాళ్ల ప్రస్థానం ఎలా సాగిందో వివరించారు. కుటుంబ సభ్యులు వాళ్ల కెరీర్ నిర్మాణానికి ఎలా దోహదపడ్డారనే విషయాన్ని చూపించారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఉన్నతస్థాయికి చేరుకోవడంలో అవసరమైన కృషి, క్రమశిక్షణను సూచిస్తుంది. ఐసిసి టి-20 ప్రపంచకప్‌కి ముందు విడుదల కావడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈసారి ప్రపంచకప్ భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతుంది. జనవరి 7 నుంచి మార్చి 8 వరకూ జరిగే ఈ మెగా టోర్నీలో 20 జట్లు పోటీ పడుతున్నాయి.

ఈ వీడియో చూపిస్తున్నది:

  • విరాట్ కోహ్లీ తన తండ్రి పట్ల ఉన్న అభిమానం మరియు అతని మరణం తర్వాత ఎదురైన సవాళ్ల గురించి మాట్లాడాడు.
  • రోహిత్ శర్మ తన కుటుంబ సభ్యుల మద్దతు మరియు వారి త్యాగాల గురించి పేర్కొన్నాడు.
  • కెఎల్ రాహుల్ తన కుటుంబం యొక్క కష్టాలను మరియు వారి మద్దతును గుర్తు చేసుకున్నాడు.
  • అర్ష్‌దీప్ సింగ్ తన తండ్రి ప్రభావం మరియు అతని క్రికెట్ ప్రయాణం గురించి మాట్లాడాడు.
  • శుభ్‌మాన్ గిల్ తన కుటుంబం యొక్క స్ఫూర్తి మరియు ప్రోత్సాహం గురించి పేర్కొన్నాడు.

ఈ వీడియో భారత క్రికెటర్ల యొక్క కృషి మరియు వారి కుటుంబ సభ్యుల త్యాగాలను చూపిస్తుంది. ఇది క్రికెట్‌పై ఉన్న ప్రేమ మరియు దేశం కోసం ఆడే ఆటగాళ్ల గురించి ఉంటుంది.

అపోలో టైర్స్ వీడియో: హర్ సఫర్ మే దమ్ హే