మందులోడా ఓరి మాయలోడా..... జనరిక్ మందులు వాడండి... ఇల్లు గుల్ల కాకుండా కాపాడుకోండి
Here's a rewritten version of the article with a suggested title:
**జనరిక్ మందులు: వాటి ప్రయోజనాలు మరియు అవగాహన
వచ్చే నెలలో 850 రకాల ఔషధాల ధరలు పెరగనున్నాయి. ఇందులో ఆంటిబయాటిక్సే కాకుండా కోట్ల మంది నిత్యం వాడే షుగర్, బిపి మాత్రల ధరలు ఓ పది శాతం పెరగొచ్చు. మన రాష్ట్రంలో ఓ 50 లక్షల మంది మధుమేహం బాధితులు ఉండొచ్చు. కేవలం 15% మాత్రమే ప్రభుత్వ మందులు వాడతారు. 85% మంది ప్రైవేటు మందులే దిక్కు.
అసలే నిత్యావసర ధరలు పెరిగాయి. గ్యాసు, పెట్రోలు, వంటనూనెలు చుక్కలు చూపిస్తుంటే పేద మధ్య తరగతికి ఇక చాలా కష్టమే. షుగర్ బిపి ఉంటే ఓ 2000 అదనంగా భరించాల్సిందే. ఇంటిలో ఇద్దరుంటే అంతే. మరి ఎలా తట్టుకోవాలి అంటే జనరిక్ దుకాశాల వైపు పోవడం నేర్చుకోవాలి.
బ్రాండెడ్ మందులు, జనరిక్ మందులు, బల్కు తయారి పైరేట్సు, లోకల్ పైరేట్సు అనే నాలుగు రకాల మందులు ఉంటాయి. బ్రాండెడ్ మందులు అంటే ఒక మందు కనుగొనడానికి ట్రయల్స్ వేసేకి పరిశోధనలు చేసేకి కంపెనీలు ఖర్చు చేస్తాయి. దానిని వారు తయారు చేసుకోవాలి అని 20 ఏళ్ళు పేటెంటు తీసుకుంటారు.
జనరిక్ మందులు ఆ పేటెంటయినాక ఎవరైనా తయారు చేసుకోవచ్చు. అప్పుకొచ్చిన తర్వాత ఎక్కువ మందికి అందుబాటులో ఉంచడమే లక్ష్యం. జనరిక్ మందులు నాణ్యతను కలిగి ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ తోక పీకుడు గాళ్ళ నేమి చేయలేక జనఔషధి అనే మెడికల్ షాపుల చైన్ లు స్ధాపించింది. అందరు సామాన్యులకు అందుబాటు ధరలో జనరిక్ మందులు అనే నినాదంతో మాననీయ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశ పెట్టారు.
జనరిక్ మందులను అందరికీ అందుబాటు ధరల్లో అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో, 2014 లో మాననీయ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భారతీయ జనౌషధి పరియోజన (PMBJP)ని ఫార్మాస్యూటికల్స్ శాఖ, రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ, నవంబర్, లో భారత ప్రభుత్వం మరలా ప్రారంభించింది.
జనాభాలోని అన్ని వర్గాల ప్రత్యేకించి పేదలు, అణగారిన వారికి నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవడం, నాణ్యత అనేది అధిక ధరకు మాత్రమే పర్యాయపూదం అనే భావనను ఎదుర్కోవడం, పిఎంబిజెపి కేంద్రాన్ని ప్రారంభించడంలో వ్యక్తిగత వ్యవస్థాపకులను నిమగ్నం చేయడం ద్వారా ఉపాధిని సృష్టించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
మీ ప్రాంతాలలో ఈ దుకాశాలను నెట్ లో సర్చు చేసి గుర్తించండి. అక్కడ మందులు అతి తక్క