ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ చైర్మన్లు వీరే
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ చైర్మన్లు ఎవరో తెలుసా?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ చైర్మన్లుగా ఎన్నికైన నాయకుల పేర్లు వెలువడ్డాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని వివిధ మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేశారు.
నల్లగొండ జిల్లా మున్సిపల్ చైర్మన్లు
నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్‌గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని ఎన్నుకున్నారు. పెరిక స్వాతి, అల్లి సుభాష్ బుర్రి అనే కార్పొరేటర్లు చైతన్య పేరును బలపర్చారు. బరిలో ఎవరూ లేకపోవడంతో ఎన్నికల ప్రత్యేక అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ చైతన్యను ఏకగ్రీవంగా ప్రకటించారు. డిప్యూటీ మేయర్ పదవి మైనార్టీ వర్గానికి ఇచ్చారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్‌గా పున్న శైలజా వెంకటేశ్వర్లు, చండూర్ మున్సిపల్ చైర్మన్‌గా కోడి శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా భూతరాజు దశరథ, చిట్యాల మున్సిపల్ చైర్మన్‌గా పందిరి గీత, హాలియా మున్సిపల్ చైర్మన్‌గా చింతల చంద్రారెడ్డి, నందికొండ చైర్మన్‌గా మానస స్వర్ణలు ప్రమాణస్వాకారం చేశారు.
సూర్యాపేట జిల్లా మున్సిపల్ చైర్మన్లు
సూర్యాపేట మున్సిపల్ చైర్మన్‌గా మోరిశెట్టి నివేదిత, కోదాడ మున్సిపల్ చైర్మన్‌గా ఎర్నేని కుసుమ బాబు, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్‌గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్‌గా తన్నీరు మల్లికార్జున, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్‌గా కొణతం చిన వెంకట్ వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్‌గా సంకెనపల్లి రఘునందన్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ చైర్మన్లు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు మున్సిపల్ చైర్మన్‌గా బీజన బాలమణి భాస్కర్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్‌గా గుండ్లపల్లి వాణి, మోత్కూరు మున్సిపాలిటీ చైర్మన్‌గా గడ్డం స్వప్న, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్‌గా మొగుదల పావని రమేష్ గౌడ్, పోచంపల్లి చైర్మన్‌గా తడక వెంకటేశంలు ప్రమాణ స్వీకారం చేశారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఎన్నికైన చైర్మన్లు, వైస్ చైర్మన్లు తమ పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు. వారికి అధికారులు శుభాకాంక్షలు త