నాకు ఏ బంతి వస్తుందో ముందే తెలుస్తుంది.. నేను మెరుగవుతున్నాను: శివమ్ దూబె

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆల్ రౌండర్ శివమ్ దూబె అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులతో 66 పరుగులు చేసిన దూబె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

గతంలో దూబె పేరు చెబితే స్పిన్నర్లను బాగా ఆడుతాడు అని అనేవారు. అయితే, ఇప్పుడు సీమ్ బౌలింగ్‌లోనూ అతడు తన ప్రతిభను చాటుతున్నాడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో దూబె మంచి నైపుణ్యం కలిగి ఉన్నాడు.

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట కొన్ని డాట్ బాల్స్ ఆడినప్పటికీ.. ఆ తర్వాత వేగం పెంచి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ అనంతరం దూబె తన ప్రదర్శన గురించి మాట్లాడాడు.

టి20 క్రికెట్‌లో డాట్ బాల్స్ ఆడటం ఒత్తిడిని పెంచుతోంది. కానీ, ఓ బ్యాటర్‌గా ఎప్పుడు వేగంగా ఆడాలో నాకు తెలుసు. ఒకవేళ నేను 10 బంతుల్లో కేవలం 2 పరుగులు చేశాను అనుకోండి. తర్వాత అయిదు బంతుల్లో నేను రెండు సిక్సులు కొడితే... సరిపొతుంది. ఆ విషయం ఎప్పటికీ నా మనసులో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆడిన ప్రతిసారీ మనం నేర్చుకుంటాం. నేను తెలివిగా మారాను. నాకు ఏ బౌలర్ ఎప్పుడు ఏ బంతి వేస్తాడో అని కాస్త ముందుగానే తెలిసిపోతుంది.

ఫాస్ట్ బౌలర్ స్లో బంతులు సంధించగలడని నాకు తెలుసు. నేను వీటి మీద చాలా ప్రాక్టీస్ చేశాను. నేను మెరుగవుతున్నాను. ప్రతి రోజు ఒక బ్యాటర్‌గా నేను ఎదుగుదల చెందుతున్నాను.

నెదర్లాండ్స్‌పై తన అద్భుతమైన ప్రదర్శన గురించి దూబె మరింత వివరంగా చెప్పాడు. "ఆ మ్యాచ్‌లో నేను బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి పిచ్ చాలా బాగుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. నేను కాస్త డొమినేట్ చేసేలా అనిపించింది.

మొదట్లో కొన్ని డాట్ బాల్స్ ఆడాను. తర్వాత నా గేమ్‌ని వేగవంతం చేసాను. స్ట్రైక్ రొటేట్ చేసాను. అవకాశం దొరికినప్పుడల్లా బౌలర్లపై దాడి చేశాను. నెదర్లాండ్స్ బౌలర్లు కఠినంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఫ్రెడ్‌ క్లాసెన్‌, వాన్ డెర్ మెర్వే బాగా బౌలింగ్ చేశారు.