తెలంగాణ బడ్జెట్ 2026-27: రూ. 3.24 లక్షల కోట్ల ఆడబడి
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2026-27 వార్షిక బడ్జెట్‌ను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ పరిమాణం రూ. 3,24,234 కోట్లుగా నిర్ణయించారు. ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ. 47,267 కోట్లు, మూలధన ఆదాయం రూ. 82,870 కోట్లుగా నిర్ణయించారు.
బడ్జెట్ కేటాయింపులు
వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి:
- వ్యవసాయానికి: రూ. 23,179 కోట్లు
- సివిల్ సప్లై శాఖకు: రూ. 7366 కోట్లు
- పశు సంవర్ధక శాఖకి: రూ. 1529 కోట్లు
- విద్యుత్ శాఖకు: రూ. 21,285 కోట్లు
- విద్యా శాఖకి: రూ. 26,674 కోట్లు
- వైద్య ఆరోగ్య శాఖకు: రూ. 13679 కోట్లు
- కార్మిక శాఖకు: రూ. 998 కోట్లు
- మహిళా శిశు సంక్షేమ శాఖ కి: రూ. 3143 కోట్లు
- షెడ్యూల్ కులాలకు: రూ. 11784 కోట్లు
- షెడ్యూల్ తెగలకు: రూ. 7937 కోట్లు
- వెనక బడిన తరగతులకు: రూ. 12511 కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి: రూ. 3769 కోట్లు
- రాజీవ్ యువ వికాసం కు: రూ. 6వేల కోట్లు
- గృహ నిర్మాణానికి: రూ. 7430 కోట్లు
- ఐటీ శాఖకు: రూ. 875 కోట్లు
- పరిశ్రమల శాఖకి: రూ. 3490 కోట్లు
- చేనేత శాఖకు: రూ. 258 కోట్లు
- పంచాయతీ రాజ్ శాఖ కు: రూ. 33,688 కోట్లు
- ఇరిగేషన్ కు: రూ. 22,615 కోట్లు
- రవాణా రోడ్డు భవనాల శాఖకి: రూ. 12,789 కోట్లు
- న్యాయ శాఖకు: రూ. 2367 కోట్లు
- పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు: రూ. 17,907 కోట్లు
- హోం శాఖకు: రూ. 11,907 కోట్లు
- గోదావరి పుష్కరాలకు: రూ. 500 కోట్లు
- పర్యాటక శాఖకు: రూ. 1224 కోట్లు.
ఉప ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం అని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్తున్నామని అన్నారు. ప్రజల ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని, రాష్ట్రాభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నామని తెలియజేశారు.