కాళేశ్వరం నీళ్లు చుక్క వాడకుండా 71.86 లక్షల టన్నుల ధాన్యం పండించాం

రైతులు, ప్రజల మద్దతుతోనే మున్సిపల్, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రైతు భరోసా, సన్న బియ్యానికి బోనస్, రైతులకు పనిముట్లు అందిస్తున్నామన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు.

అబద్ధాలు ఆడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విశ్వసించరని పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా 71.86 లక్షల టన్నుల ధాన్యం పండించామని, ఎల్లంపల్లి నీటితో పెద్ద ఎత్తున ధాన్యం పండించామని, బిఆర్‌ఎస్ హయాంలో మోటార్లకు కూడా బిల్లులకు పెండింగ్ పెట్టారని, బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కట్టిన ఒకే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఎద్దేవా చేశారు.

ఇందిరమ్మ రాజ్యంలో కట్టిన ప్రాజెక్టులు నేటికీ సేవలందిస్తున్నాయని ప్రశంసించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి ధరణితో చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక భూముల సమసల్య పరిష్కారానికి భూదార్ తీసుకొచ్చామని, పెద్ద ఎత్తున గ్రామ పాలనాధికారులు, లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించామని, ఈ ఏడాది 3.76 లక్షల మందికి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశామని, గతంలో పాలమూరు-రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బిసిని కూడా పెండింగ్‌లో పెట్టామన్నారు.

పెండింగ్ ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించిందని తెలియజేశారు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోలేదని, ఆ ప్రాజెక్టుపై ఇంకా స్ట్రక్చరల్ ఆడిట్ చేయాల్సి ఉందని తెలిపారు.

కాగా, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, ప్రజల మద్దతుతోనే మున్సిపల్, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందన్నారు.

ప్రజలు కాంగ్రెస్‌పై విశ్వాసం ఉంచారని, రైతులు, ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు.