ఆ విమర్శలకు నేను జవాబుదారుడిని కాదు: గౌతమ్ గంభీర్
టి20 వరల్డ్ కప్ 2026: గౌతమ్ గంభీర్‌కు విమర్శలెన్నో.. కానీ నేను జవాబుదారుడిని కాదు!
టి20 వరల్డ్ కప్ 2026ను టీమిండియా గెలుచుకుంది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ కప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడారు.
ఈ విజయంతో గంభీర్‌కు చాలా సంబరంగా ఉంది. మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ టీమిండియాను గాడిలో పెట్టాడని, వివిఎస్ లక్ష్మణ్ సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో సేవలు అద్భుతంగా ఉండడంతో ఈ టి20 వరల్డ్ కప్ వారికి అంకితం చేస్తున్నానని తెలిపారు. బిసిసిఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, ఐసిసి ఛైర్మన్ జైషాకు కూడా కృతజ్ఞతలు చెప్పాడు.
గంభీర్ మాట్లాడుతూ.. తాను, అజిత్ అగార్కర్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నామని, కానీ అజిత్ చాలా నిజాయతీగా పని చేశాడని కొనియాడారు. టి20 కెప్టెన్ సూర్యకుమార్ తన పనిని సులభతరం చేశారని ప్రశంసించారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు ఓటమి తరువాత జైషా తనకు ఫోన్ చేసి మద్దతు నిలిచాడని గుర్తు చేశారు.
సోషల్ మీడియాలో తనపై విమర్శలకు తాను జవాబుదారుడిని కాను అని, టీమిండియాకు మాత్రమే జవాబుదారుడిగా ఉంటానని వివరణ ఇచ్చాడు. ఆటగాళ్లే తనని కోచ్ చేశారని, కానీ జట్టులాగే కోచ్ కూడా మంచివాడేనని గౌతమ్ పేర్కొన్నారు.
ఓడిపోతామనే భయాన్ని వీడి... ధైర్యంగా ఆడాలని, రక్షణాత్మకంగా క్రికెట్ ఆడటం కంటే దూకుడు బ్యాటింగ్ చేసి 120 పరుగుల ఆలౌటైన మంచిదేనని గంభీర్ తెలియజేశారు. దూకుడు బ్యాటింగ్ చేయడంతో సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో 250+ పరుగులు చేయగలిగామని వివరణ ఇచ్చాడు.
గొప్పగా భావిస్తున్నా
"ఇది నాకు గొప్ప భావన. నేను ఇక్కడికి వచ్చాక, మొదటి రోజు నుంచి అందరి నుంచి సహకారం లభించింది. ఇందులో బిసిసిఐ సెక్రటరీ, జైషా, అజిత్ అగార్కర్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ సహకారం ఎంతో ఉంది. ఈ విజయాన్ని వారందరికీ అంకితం చేస్తున్నా. టీ20 వరల్డ్ కప్ గెలవడం సులభమేమీ కాదు. కానీ మా జట్టు కష్టపడి మొదటి రోజు నుంచి దూకుడు బ్యాటింగ్‌పై దృష్టి పెట్టింది. దానికి తగ్గట్లుగానే ఫలితం సాధించాం. సూర్యకుమార్ యశస్వి మొదటి వికెట్కు చాలా అద్భుత