ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోంది: గవర్నర్
"తెలంగాణ రైజింగ్: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన"
హైదరాబాద్: దేశానికి దిక్సూచీగా మన రాష్ట్రం నిలుస్తుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కొనియాడారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం అని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలి ప్రసంగం చేశారు. తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులేస్తున్నామని, శ్రమించే తత్వంగల శాంతికాముకులు తెలంగాణ ప్రజలు అని తెలియజేశారు. తెలంగాణ పురోగతిలో ప్రతీ పౌరుడు భాగస్వామి అని..ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని, ఏడాది కాలంలో సంక్షేమ పథకాలు అందరికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని, జిహెచ్ఎంసిని మూడు కార్పొరేషన్లుగా, కోర్, ప్యూర్, రేర్ గా తెలంగాణను విభజించామని గవర్నర్ పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జిహెచ్ఎంసి విభజన చేశామని, ప్రజలకు భద్రత, రక్షణ కల్పించేలా 4 కమిషనరేట్లు ఏర్పాటు చేశామని అన్నారు. హిల్ట్ పాలసీతో పరిశ్రమ భూముల బదలాయింపు జరిగిందని, మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి చేశామని గవర్నర్ అన్నారు. మూసీలో మురుగునీరు చేరకుండా 39 ఎస్టిపిలు నిర్మాణం జరిగిందని, ఒఆర్ఆర్, ఆర్ఆర్, కు అనుబంధంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తామని అన్నారు. 55కి.మీ. మేర మూసీని పునరుజ్జీవింప చేస్తామని, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వే, బుల్లెట్ రైలుకు శంషాబాద్‌ను కేంద్రంగా మార్చబోతున్నామని గవర్నర్ పేర్కొన్నారు.
వరంగల్, అదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయని, గ్లోబల్ సమ్మిట్‌తో రూ. 5 లక్షల 72 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తెలంగాణను అభివృద్ధిలో గ్లోబల్ హబ్‌గా మార్చాలనుకుంటున్నామని గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు.
గవర్నర్ ప్రసంగం సమయంలో బిఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సభలో నిలబడిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగాన్ని తిలకించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులేస్తున్నామని గవర్నర్ అన్నారు. శ్రమించే తత్వంగల శాంతికాముకులు తెలంగాణ ప్రజలు అని తెలియజేశారు.
తెలంగాణ పురోగత