మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి
తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు పేర్కొన్నారు. పంట మార్కెట్‌కు వచ్చి 15 రోజులవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు తెరవలేదని ఆయన విమర్శించారు.
రూ. 2400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్నను దళారులకు రూ. 1600-1700కే రైతులు అమ్ముకుంటున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుందా? దళారులకు మేలు చేస్తుందా? అనేది స్పష్టం చేయాలన్నారు.
వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, మొక్కజొన్నను ప్రభుత్వం మద్దతు ధరకు కొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ, రైతులకు అండగా గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, నాయకులు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి బిఆర్ఎస్ నేతలు నివాళులర్పించిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.
వరి వేయొద్దని, పంట మార్పిడి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదేపదే చెబితే ఈ సారి నమ్మి రాష్ట్రంలో రైతులు సుమారు 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని, తీరా పంట చేతికి వచ్చాక ఆ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచుతోందని దుయ్యబట్టారు.
ఒకవైపు మద్దతు ధర లేక నష్టపోతుంటే, మరోవైపు అకాల వర్షాలకు మార్కెట్ యార్డుల్లో, కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న తడిచిపోయి రైతులు కన్నీరు పెడుతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
గత రెండు రోజులుగా కురిసిన వడగండ్ల వానలకు మొక్కజొన్న, మామిడి సహా ఇతర పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, బడ్జెట్లో పంటల బీమా గురించి గొప్పగా ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదన్నారు.
ఈ ప్రభుత్వం అటు పంటల బీమా అమలు చేయదని, ఇటు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వదని చురకలంటించారు.
గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ అందడం లేదని, ప్రభుత్వం కేవలం మాటల్లో చెబుతున్నదే తప్ప చేతలలో లేదని ఎద్దేవా చేశారు.
ఇప్పటివరకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలని హ