తెలుగు వారి తొలి పండుగ ఉగాది

ఉగాది: తెలుగు వారి తొలి పండుగ

తెలుగు వారి సంస్కృతిలో పండుగలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగలు ప్రజలను సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఏకం చేసి వారిలో మానవతావిలువల పెంపుకు దోహదపడతాయి. తెలుగు వారికి తొలి పండుగగా పేరొందినది ఉగాది. ఈ పండుగకు నేపథ్యం సృష్టిమొదలై మానవులు చైతన్యం పొంది, నాగరికతకు ఎదిగిన రోజుగా చెప్పబడింది.

ఉగాది: చైత్రశుద్ధ పాడ్యమి

తెలుగువారికి చాంద్రమాన కొత్త సంవత్సరం మొదటిరోజు చైత్రశుద్ధ పాడ్యమిన ఈ పండుగను జరుపుకోవడం సంస్కృతిగా మారింది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారంగా ఉగాది పండుగను నిర్ణయించారు. చైత్రమాసంలో మొదటి పక్షమైన శుక్లపక్షంలో తొలితిథి అయిన పాడ్యమి బ్రాహ్మిముహూర్తం నుంచి ఉగాది మహాపర్వ దినాన్ని శాస్త్రయుక్తంగా ప్రజలు నిర్వహించి తరించాలని పెద్దలు ఉపదేశించారు.

పంచాంగం: జ్యోతిష్యశాస్త్రం

ఈ పండుగకు జ్యోతిష్య శాస్త్రాన్ని పట్టాభిషేకం చేశారు. కొత్త సంవత్సరంలో జ్యోతిష్యశాస్త్ర (పంచాంగం) ప్రకారం నడుచుకుంటే ఏ ఇడుములు రావని చెప్పారు. పంచాంగం అనేది జ్యోతిష్యశాస్త్రంలో ఒక ముఖ్యమైన అంగం. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం అనే ఐదు అంగాలతో పంచాంగం రూపొందింది.

పంచాంగ శ్రవణం

పండుగనాడు పంచాంగ శ్రవణాన్ని పాటింపును చేశారు. వ్యక్తుల ఆదాయ, వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు, కందాయఫలాలు, రాశిఫలాలు, తెలియజెప్పే పంచాంగం వినడాన్ని పండుగనాడు ఆనవాయితీని చేశారు. అలాగే కొత్త సంవత్సరంలో దేశ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామాల భవిష్యత్తులు, మంచిచెడులను, కొత్త సంవత్సరంలో తారసపడే పరిణామాలు, శుభాశుభ ఫలితాలు పంచాంగంవల్ల తెలుస్తాయి.

2000 ఏళ్ల నాటి నుంచి

ఈ నేపథ్యంలో సుమారు 2000 ఏళ్ళనాడు విక్రమార్క, శాలివాహన చక్రవర్తుల శకాలు ఉగాది నుంచే ప్రారంభమై తిథి, వార, నక్షత్ర, పక్ష, మాసాదులతో కూడిన పంచాంగం రూపొందించబడి ఇక్ష్వాకుల రాజులపాలనా కాలం నుంచి వాడుకలోకి వచ్చిందని చరిత్ర నిర్ధారిస్తున్నది.

ఉగాది విశిష్టత

ఉగాదినాడు తెల్లవారు జామున తైలాభ్యంగనం దైవారాధనం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి), ప్రపాదాన ప్రారంభం (చలివేంద్రాలు నెలకొల్పడం), పంచాంగశ్రవణంతో పాటు ప్రతీ ఒక్కరూ కొన్ని విధులూ, నియమాలు పాటించాలని, అలాగే ప్రాచీన రుచ