Bandi Sanjay: రేవంత్ తో మాకు దోస్తీ అవసరమేంది..? కేటీఆర్ ట్వీట్ పై బండి సంజయ్ ఆగ్రహం..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. నాకు రేవంత్ రెడ్డితో దోస్తానా ఉంటే మీ ప్రభుత్వం పడిపోయే ప్రమాదముందని ఇట్ల మీడియా ముందు మాట్లాడతమా. నేనే కాదు… ఎవరితోనైనా దోస్తానా. ఉంటే ఫోన్ లో మాట్లాడుకుంటరే తప్ప మీడియాతో మాట్లాడరు కదా అని ప్రశ్నించారు. రేవంత్ తో దోస్తానా అవసరమేంది..?

బండి సంజయ్ ఆగ్రహం

కేటీఆర్ చేసిన ట్వీట్ మీద ప్రతిస్పందిస్తూ... బండి సంజయ్ మాట్లాడుతూ మీ అయ్యకు కాంగ్రెస్ పెద్దలతో దోస్తానా ఉంది కాబట్టే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లో అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకే చీకట్లో ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని డబ్బు సంచులు ఇచ్చి వచ్చింది వాస్తవం కాదా..? అన్నారు.

ఆ కేసులు విచారణకు రాకుండా ఢిల్లీ పెద్దల మందు సాగిలపడ్డది నిజం కాదా. అని ఖండించారు.

సీఎం రేవంత్ ను కాపాడేందుకు బండి సంజయ్ తాపత్రయపడుతున్నారంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ కు తీవ్రస్థాయిలో ఘాటుగా బదులిచ్చారు.

మీరు పదేళ్లు అధికారంలో ఉన్నరు కదా... ఎందుకు తేల్చలేకపోయారు. ఎందుకు ఆ కేసును నీరుగార్చారు. రేవంత్ తో దోస్తానా ఉన్నది మీకా... మాకా? అన్నారు.

కేటీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఈ గతి పట్టిందన్నారు. అయినా కేటీఆర్ కు అహంకారం తగ్గలే అని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగే పరిస్తితి కూడా లేదన్నారు. ఆయన బాధ భరించలేకే బీఆర్ఎస్ అధినేత కే

Close Menu