Kishan Reddy: హైదరబాద్‌ నుంచి యాద్రాద్రి వరకు ఎంఎంటీఎస్‌ సర్వీసులు..

హైదరాబాద్ నుంచి యాద్రాద్రి వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ను స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో నిర్మాణం చేశామన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి తెలంగాణకు రైల్వేల విషయంలో అన్యాయం జరిగిందన్నారు.

కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి

నూతన రైల్వే లైన్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఇప్పటికే హైదారాబాద్ లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగుడతోపాటు అదనంగా చర్లపల్లిని నాలుగో నూతన రైల్వే స్టేషన్ గా రాబోతుందని తెలిపారు. దీనికారంగా హైదారాబాద్ లో ట్రాఫిక్ తగ్గుతుందని తెలిపారు.

ప్రధాని నేతృత్వంలో ఈ రైల్వే స్టేషన్ ను తక్కువ సమయంలో నిర్మించామని తెలిపారు. ఇప్పటికే 98 శాతం పూర్తి అయ్యిందని తెలిపారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ను 430 కోట్ల రూపాయాలు ఖర్చు చేసి నిర్మించామన్నారు. రైల్వే ట్రాక్ నిర్మాణంతో పాటు కొత్త టెక్నాలజీతో అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. దివ్యాంగులకు, వృద్దులకు మెట్లు ఎక్కడానికి ఎస్కలెటర్లు, లిఫ్ట్ లు ఏర్పాటు చేశామన్నారు.

Close Menu