Secunderabad To Goa Trains: సికింద్రాబాద్-గోవా వీక్లి ట్రైన్.. ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

సికింద్రాబాద్-గోవా వీక్లి ట్రైన్‌ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. దీనిని నవరాత్రుల కానుకగా ప్రకటించారు. దీని వల్ల తెలుగు రాష్ట్రాలకు, మరియు కర్ణాటకకు గోవా కు రవాణ వసతి మెరుగవుతుంది. ఇదో డైరెక్ట్ రైలు.

ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి గోవాకు బయలుదేరే రైళ్లు ఎక్కువగా లేవు. ఎక్కువగా ఒక రైలు బయలుదేరి గుంతకల్ జంక్షన్‌లో ఆగి అక్కడ నుంచి వేరే రైలులో కలిసేవారు.

దీని వలన ప్రయాణికులకు చాలా ఇబ్బందులు పడుతుంది. ఇక ఇప్పుడు నేరుగా సికింద్రాబాద్‌ నుంచి గోవా సౌకర్యం ఉంటుంది.

బుధ, శుక్రవారాల్లో ఉదయం 6 గంటల 25 నిమిశాలకు బయలుదేరి, రాత్రి 9 గం.ల 42న్.లకు‌ గోవా చేరుతుంది. ఈ రైలు కాచిగూడ, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, గద్వాల్‌, కర్నూల్‌, అలంపుర్‌, గుంతకల్, బెళ్లారి, హోస్పేట్‌, కొప్పల్, గడగ్‌ల మీదుగా ప్రయాణం సాగుతుంది.

సికింద్రాబాద్-వాస్కోడగామా రైల్లో రెండవ, మూడవ తరగతి ఎసి, మూడవ తరగతి నాన్-ఎసి, స్లీపర్‌ తరగతి వసతి ఉంటుంది.

సికింద్రాబాద్-గోవా వీక్లి ట్రైన్‌ సాధారణ రైలుగానే నడుస్తుంది. దీని మీద అదనపు ఛార్జీ ఎలాంటిదీ విధించరు.

దీనితోపాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, గోవా పర్యాటక రంగానికి, వాణిజ్యానికి దోహదపడుతుంది.

దీనితో స్థానిక ప్రజలు, విదేశీ పర్యాటకులు వీటిని చూడడానికి, సందర్శించడానికి వీలుంటుంది.

Close Menu