కార్తీక దీపం ఇష్యూ: తమిళనాడు ఎన్నికల ముందు అగ్గి రాజేస్తోన్న వివాదం

తమిళనాడులో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు

 కార్తీక దీపం ఇష్యూ మరోసారి రాజుకుంది.


మదురైలోని తిరుప్పరంకుండ్రం హిల్‌పై ఉన్న అరుల్మిగు

 సుబ్రమణ్య స్వామి ఆలయం, దర్గా వివాదం దాదాపు

 వందేళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది.


తాజా తీర్పు

మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కొండ శిఖరంలో దీపం వెలిగించడానికి అనుమతించింది. అయితే, పోలీసులు ఇప్పటికీ దీపం వెలిగించేందుకు అనుమతించడం లేదని బీజేపీ, హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి.

బ్రిటిష్ కాలంలోనే సమస్యలు

ఆలయం వద్ద బ్రిటిష్ కాలంలోనే సమస్యలు మొదలయ్యాయి. కొండ యాజమాన్య హక్కులు దేవాలయానివని, అయినప్పటికీ కొండ శిఖరంలోని దర్గా, నెల్లితొప్పు అనే ప్రాంతం మాత్రం దేవాలయ పరిధిలోకి రావని అప్పట్లో ప్రివి కౌన్సిల్ తీర్పు ఇచ్చింది.

వివాదం ఎందుకు మళ్లీ ఎలా రగిలింది?

ఆచారాలు, ఊరేగింపులు, పండుగల సమయంలో భారీ దీపం వెలిగించే ఆచారాలను కొనసాగించడానికి అందుకు తగ్గ పవిత్ర ప్రదేశం(కొండపై స్తంభం ఉన్న చోట)పై పిటిషన్లు రావడంతో వివాదం మళ్లీ ముందుకొచ్చింది.

డీఎంకే ఏమంటోంది?

చట్టాన్ని గౌరవిస్తామని, 2014 హైకోర్టు తీర్పు ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని డీఎంకే అంటోంది. వచ్చే సంవత్సరం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఈ అంశాన్ని బీజేపీ వాడుకుంటోందని డీఎంకే ఆరోపణలు చేస్తోంది.

కార్తీక దీపం ప్రాధాన్యత

కార్తిగై (కార్తీక) దీపం తమిళ ప్రజలు మురుగన్ కోసం జరుపుకునే పండుగ. ఇది హిందూ పండుగ కాదు అని మంత్రి ఎస్ రేగుపతి అన్నారు.

తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం

కొండపై దీపం వెలిగించవచ్చని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇవాళ స్పెషల్ లీవ్‌ పిటిషన్ (SLP) ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Previous Post Next Post